హైకోర్టుపై నిందలు… కొమ్మినేనికీ నోటీసులు..!

ఉన్నత న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి టీవీ ప్రధాన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా 44 మందికి హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై… అసభ్య పోస్టులను వీరందరూ పెట్టినట్లు… ఆధారాలతో సహా న్యాయస్థానం రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు అందాయి. నోటీసులు అందుకున్న వారిలో కొమ్మినేనితో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. ప్రసాద్ రెడ్డి అనే మరో జర్నలిస్టుకి.. పంచ్ ప్రభాకర్ అనే అమెరికా లో ఉండే వైసీపీ అభిమానికి కూడా నోటీసులు వెళ్లాయి. ఇప్పటికే 49 మందికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు పలువురిపై సీఐడి కేసులు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించింది.

కొమ్మినేని శ్రీనివాసరావు సుమన్ టీవీ అనే యూ ట్యూబ్ చానల్‌కు ప్రత్యేకంగా ఇంటర్యూ ఇచ్చి..న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిజానికి కొమ్మినేని సాక్షి టీవీలోనే చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఎన్నో సార్లు.. వైసీపీకి మద్దతుగా.. ఆ చర్చా కార్యక్రమాల్లో ఆవేశపడ్డారు. వైసీపీ మద్దతుదారుని తరహాలో ప్యానెల్‌లో కూర్చున్నవారితో వాదులాటకు దిగారు. అయితే.. న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసే విషయంలో మాత్రం ఆయన సాక్షిలో నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమంలో కాకుండా.. సుమన్ టీవీ చానల్ కు ఇంటర్యూ ఇచ్చి మరీ…అలాంటి ప్రకటనలు చేశారు. ఆ వీడియో క్లిప్‌లతో హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అలాగే పంచ్ ప్రభాకర్ అనే అమెరికాలో ఉండే వ్యక్తికి నోటీసులు వెళ్లాయి. ఈయన అమెరికాలో ఉన్నప్పటికీ.. వైసీపీ లాంగ్వేజ్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఉంటారు. అసభ్యమైన మాటలు.. బూతులతో తన పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ వర్కవుట్ అయిందని అనుకున్నారేమో కానీ అదే ఫ్లోలో కోర్టును కూడా అసభ్యంగా దూషించారు. ఆ క్లిప్ లుకూడా వైరల్ అవడంతో.. హైకోర్టు నోటీసులకు దారి తీసింది. ప్రసాదర్ రెడ్డి అనే మరో జర్నలిస్టు కూడా నోటీసులు అందుకున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ మెయిల్‌కు పెద్ద ఎత్తున న్యాయమూర్తులపై నిందలు వేసినవాళ్లు..తప్పుడు ప్రచారం చేసిన పోస్టుల వివరాలతో ఫిర్యాదులు వెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా బీజేపీ ఎందుకు భరిస్తోంది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.....

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా – వీక్షించిన 50,000 మంది…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమానికి పలువురు...

HOT NEWS

[X] Close
[X] Close