ద‌ర్శ‌కేంద్రుడి ‘కాన్సెప్ట్’ ఏమిటి?

న‌మోః వేంక‌టేశాయ త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు ద‌ర్శ‌కేంద్రుడు. ఆయ‌న సినిమాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ద‌ర్శ‌కేంద్రుడు రిటైర్ అయిపోయార‌ని, ఆయ‌న ఇక సినిమాలు చేయ‌ర‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా తీసి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల‌న్న‌ది ద‌ర్శ‌కేంద్రుడి ఉద్దేశం. అందుకే ఓ ప్రాజెక్టు సెట్ చేశారు. ముగ్గురు ద‌ర్శ‌కులు, ముగ్గురు హీరోయిన్లు, ఓ హీరోతో సినిమా చేయాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌. యేడాది క్రింద‌టే.. ఈ ప్రాజెక్టుకి అంకురార్ప‌ణ జ‌రిగింది. ఇప్ప‌టికి లైన్‌లోకి వ‌చ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివ‌రాలూ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని ద‌ర్శ‌కేంద్రుడు చెబుతున్నారు.

అయితే.. ఈక్రేజీ ప్రాజెక్టు వెనుక కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన అంశాలున్నాయి. ఇది మూడు ఉప క‌థ‌ల‌తో సాగే సినిమా. మూడు ఉప‌క‌థ‌ల్లోనూ హీరో ఒక్క‌డే. హీరోయిన్లే మార‌తారు. ఈ మూడు క‌థ‌ల్నీ ముగ్గురు ద‌ర్శ‌కుల‌కు ఇచ్చి డైరెక్ట్ చేయ‌మంటారు. ఆ సినిమాకి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ క‌మ్ నిర్మాత‌.. రాఘ‌వేంద్ర‌రావునే. ఓ ద‌ర్శ‌కుడిగా క్రిష్‌ని అనుకుంటున్నారు. అనిల్ రావిపూడి లాంటి యువ ద‌ర్శ‌కులూ… రాఘ‌వేంద్ర‌రావు మ‌దిలో ఉన్నారు. ఈమ‌ధ్య మంచి విజ‌యాలు అందుకున్న కొంత‌మంది యంగ్ డైరెక్ట‌ర్స్ లిస్టు త‌యారు చేశారు రాఘ‌వేంద్ర‌రావు. అందులో ఒక‌రికి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు. హీరో కూడా యంగ్ బ్యాచ్‌లోంచే తీసుకుంటారు. ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ పేరు, ఒక్కో ద‌ర్శ‌కుడి పేరు బ‌య‌ట‌పెడుతూ.. చివ‌రికి హీరోని రివీల్ చేస్తారు. ఈ యేడాది చివ‌ర్లోనే షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close