చట్టం కాకుండా రాజధాని ఆఫీసులు తరలించొద్దు : హైకోర్టు

అధికార వికేంద్రీకరణ బిల్లు చట్టంగా మారకుండా.. కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తరలించినట్లుగా నిరూపణ అయితే.. ప్రభుత్వాన్ని, అధికారులను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. రాజధాని తరలింపు, సీఆర్డీఏ బిల్లు రద్దు అంశాలపై.. హైకోర్టులోదాఖలైన అనేక పిటిషన్లపై విచారణలో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద సంఖ్యలో రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు అంశాలపై పిటిషన్లు దాఖలు కావడంతో.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్.. పిటిషన్లపై విచారణ జరిపింది. విచారణ ప్రారంభమైన వెంటనే.. బిల్లుల గురించి న్యాయమూర్తి ఆరా తీశారు. ఏ స్థాయిలో ఉన్నాయని ప్రశ్నించారు. శాసనసభలో బిల్లు ఆమోదం పొందిందని.. శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపిందని.. అడ్వకేట్ జనరల్.. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. బిల్లు చట్టంగా మారడానికి సమయం ఉంది కాబట్టి… విచారణను ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. ఈ సమయంలో రైతుల తరపు న్యాయవాది అశోక్ భాన్.. బిల్లు చట్టంగా మారకపోయినప్పటికీ.. ప్రభుత్వ ఆఫీసుల్ని తరలించాలని.. మౌఖిక ఆదేశాలు ఇస్తున్నరారని… అందుకే కార్యాలయాలు తరలించుకుండా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై స్పందిచిన న్యాయమూర్తి.. బిల్లుచట్టంగా మారకుండా.. కార్యాలయాలను తరలించకూడదన్నారు. అలా చేసినట్లు నిరూపణ అయితే. . ప్రభుత్వం, సంబంధిత అధికారుల్ని బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు. ఆ ఖర్చును బాధ్యుల వ్యక్తిగత ఖాతా నుంచి జమ చేయాల్సి ఉంటుందన్నారు. రైతులు తమ అభిప్రాయాలు తెలిపే సమయం ముగియకుండానే.. రైతుల అభిప్రాయాలు పరిశీలించకుండానే.. ప్రభుత్వం బిల్లు పెట్టిన విషయాన్ని రైతుల తరపున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

హైకోర్టు స్వయంగా సమయం ఇచ్చినా.. ఆ సమయం గడవక ముందే.. ఎందుకు బిల్లు పెట్టాల్సి వచ్చిందని.. అడ్వకేట్ జనరల్‌ను ధర్మానసం ప్రశ్నించింది. ఓ దశలో.. ప్రభుత్వం చేపట్టిన బిల్లులు మనీ బిల్లులని.. అశోక్ భాన్ వాదించారు. దాంతో ఉలిక్కిపడిన ఏజీ.. అవి మామూలు బిల్లులేనని..ద్రవ్య బిల్లులు కాదని.. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తనికి బిల్లు చట్టంగా మారకపోయినా.. తరలింపు ప్రక్రియ ప్రారంభించాలనుకున్న ప్రభుత్వానికి ఓ రకంగా ఇబ్బందికర పరిణామమే. నెల రోజుల వరకూ.. తరలింపునకు అవకాశం లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూ. 117 కోట్ల ఏపీ సీఎంఆర్ఎఫ్‌ సొమ్ముకు నకిలీ చెక్కులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఏకంగా రూ. 117 కోట్లను కొట్టేయడానికి వేసిన ఓ ప్లాన్ బయటపడింది. సీఎంఆర్ఎఫ్ పేరుతో.. అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవిన్యూ శాఖ ఇచ్చినట్లుగా చెబుతున్న...

ఆ బిల్లులు రాజ్యసభలో ఓటింగ్ లేకుండానే పాస్..!

వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో గట్టెక్కడం కష్టమని.. కేంద్ర ప్రభుత్వ చిక్కులలో పడిపోయిందని ప్రతిపక్షాలు ఊహించుకున్నాయి కానీ... బీజేపీ పెద్దలు అంత కంటే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓటింగ్ అవసరం లేకుండా.. మూజువాణి ఓటుతో ఆమోదించేసినట్లుగా...

నాగ అశ్విన్ పరిస్థితేంటి?

'మ‌హాన‌టి' త‌ర‌వాత‌... మ‌రో సినిమా మొద‌లెట్ట‌లేదు నాగ అశ్విన్‌. ప్ర‌భాస్ తో ఓ సినిమా ఓకే చేసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చాడు. వైజ‌యంతీ మూవీస్ లో దాదాపు 300 కోట్ల‌తో ఈ సినిమా...

షరతుల్లేకుండానే రాజ్యసభలోనూ వ్యవసాయ బిల్లుకు వైసీపీ మద్దతు..!

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో.. వైసీపీ బీజేపీకి అండగా నిలిచింది. ఎన్డీఏ పక్షంలోని పార్టీలే ఆ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్న సమయంలో.. వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close