ఏపీలో హీరో మోటార్ సైకిల్స్ సంస్థ ఏర్పాటుకు అవరోధం

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి చాలా తీవ్రమయిన పోటీని ఎదుర్కొని హీరో మోటార్ సైకిల్స్ సంస్థని ఏపీకి రప్పించగలిగారు. దక్షిణాది రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఆ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లి వద్ద సుమారు రూ. 3, 000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పడానికి అంగీకరించింది. అక్కడ ఏడాదికి సుమారు 20లక్షల వాహనాలు ఉత్పత్తి చేయాలని, క్రమంగా దానిని ఒక కోటి ఇరవై లక్షల వాహనాల ఉత్పత్తి చేసే స్థాయికి విస్తరించాలని ఆ సంస్థ ప్రణాళిక సిద్దం చేసుకొంది. ఏడాదికి అన్ని వాహనాలు ఉత్పత్తి చేసే ఆ సంస్థలో అనేక వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాది దొరుకుతుంది. ఆ సంస్థకి అనుబంధంగా అనేక చిన్నా, పెద్దా సంస్థలు తరలివస్తాయి. ఆ సంస్థ నుండి పన్నుల రూపంలో రాష్ట్రానికి భారీగా ఆదాయం కూడా సమకూరుతుంది.ఊహించలేని అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు అవసరమయిన స్థలం, అనుమతులు వగైరా అన్నీ చకచకా మంజూరు చేసింది.

అందుకోసం ఐశ్వర్య ఆర్చిడ్స్ అనే సంస్థకు చెందిన 844 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పద్దతిలో తీసుకొంది. కానీ దానికి తగిన నష్టపరిహారం ప్రభుత్వం తమకు ఇంతవరకు చెల్లించలేదని, అదేవిధంగా పునరావాస ప్యాకేజీ క్రింద తమకు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తమ భూమిని స్వాధీనం చేసుకొని హీరో సంస్థకు కట్టబెట్టిందని, కనుక దానిపై స్టే మంజూరు చేయాలని కోరుతూ ఐశ్వర్య ఆర్చిడ్స్ సంస్థ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. దానిపై స్పందించిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆ స్థలంలో హీరో సంస్థ ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు చేప్పట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆ స్థలాన్ని ‘యధాతధ స్థితి’లో ఉంచాలని ఆదేశించింది. చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి సాధించుకు వచ్చిన హీరో సంస్థ నిర్మాణానికి ఆదిలోనే ఇటువంటి అవరోధం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించలేకపోతే ఇటువంటి అవకాశం కొరకే ఎదురు చూస్తున్న ఇరుగుపొరుగు రాష్ట్రాలు మన హీరోని ఎత్తుకుపోయే ప్రమాదం ఉంటుంది.ఇంతకు ముందు టాటా కంపెనీ బెంగాల్ రాష్ట్రంలో నానో కార్ల ఉత్పత్తి కర్మాగారం స్థాపించేందుకు సిద్దపడినా ఆ సంస్థకు ఇచ్చిన భూముల విషయంలో ఎదురయిన సమస్యలను పరిష్కరించడంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపడంతో టాటా సంస్థ గుజరాత్ రాష్ట్రానికి తరలిపోయింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాలు టాటా కార్ల తయారీ సంస్థను తమ రాష్ట్రానికి ఆకర్షించడానికి పోటీ పడ్డాయి. ఇప్పుడు హీరో మోటార్స్ సంస్థ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మేల్కొనకపోతే అదే విధంగా జరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే వేరే కొత్త సంస్థలు రాష్ట్రానికి రావడానికి సంకోచించవచ్చును. కనుక ముఖ్యమంత్రి, రాష్ట్రప్రభుత్వం ఎంతసేపు ఓటుకి నోటు, పుష్కరాల వంటి వాటితోనే కాలక్షేపం చేయకుండా ఇటువంటి ముఖ్యమయిన విషయాలపై కూడా అంతే శ్రద్ధ కనబరిస్తే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు ఇచ్చిన సీఐడీ !

ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీలో మరోసారి తమ పరువు తీసుకున్నారు. 41A నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చి ...ముందుగా వాట్సాప్‌లో నోటీసులు పంపారు. అందుకున్నానని లోకేష్ రిప్లై ఇచ్చాక మళ్లీ.....

వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన...

ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారు – కేసీఆర్ సాధిస్తారు : కేటీఆర్

ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోసారి అదే పని చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం మిస్ పైర్ అవుతూ ఉంటాయి....

రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close