పెట్రోల్ ధర తగ్గినా ఏడుపే !

సుబ్బారావు మార్నింగ్ వాక్ కి వెళుతూ, వెళుతూ తన బాల్య మిత్రుడు పుల్లారావుని పలకరిద్దామని వాళ్లింటికి వెళ్ళాడు. వెళితే ఏముందీ… ఆ ఇంట్లోనుంచి ఏడుపులు, పెడబొబ్బలు…
సుబ్బారావుకి గుండె ఆగినంత పనైంది. ఏదో కీడు శంకించింది. నెమ్మదిగా లోపలకు అడుగుపెట్టాడు.
లోపల సోపాలో కూర్చుని పుల్లారావు బోరున ఏడుస్తున్నాడు. సోపా కింద కంటినీటి ప్రవాహం పెరుగుతోంది. సుబ్బారావు మరింత కంగారు పడ్డాడు.
` ఏంట్రా పుల్లారావు, ఏమైందీ ?’ ఆదుర్దాగా ప్రశ్నించాడు.
వాడి భార్యకూడా కంటనీరు పెట్టుకుంటూ మరో పక్క ముక్కుచీదుకుంటూ…
`ఏమిటో అన్నయ్యగారూ, ఇవ్వాళ లేచిన వేళ మంచిదికాదు. పొద్దున్నే ఇలాంటి వార్త వినాల్సివచ్చింది.’ అని అంది.
సుబ్బారావు మనసు కుదుటపడింది. ఓసి, ఇంతేనా, టీవీలో వార్త చూసి కలవరపడినట్టున్నారు, పిరికి జీవులు. ఇంట్లో వాళ్లు క్షేమంగానే ఉన్నట్టున్నారు. థాంక్ గాడ్… అనుకుంటూ వెంటనే తానూ ఓ సోపాలో కూలబడ్డాక…
`ఓరేయ్, పుల్లారావు, ఎందుకురా ఈ ఏడుపు ? ఏం జరిగిందో చెప్పు. ఇటు చూడు, నేనెవర్నీ నీ బాల్య స్నేహితుణ్ణి కదా, మరి నీకెందుకు చింత నాతో చెప్పు. అవునూ, ఏ వార్త నిన్ను ఇంతగా బాధపెట్టిందిరా…? (ఏదో గుర్తొచ్చినట్టుగా) ఓహో…అవున్రా మహా బాగా పాడేవాడు. అందాల రాముడు, విచిత్రబంధం సినిమాల్లో ఎంత బాగా పాడాడనుకున్నావ్… రామకృష్ణగారు ఇక లేరన్న వార్త వినగానే ఇలా అయిపోయావా…? ‘
పుల్లారావు మధ్యలో అడ్డుతగిల్తూ…
`నువ్వు చెప్పింది నిజమేరా, మంచి ఆయన మంచి గాయకుడేరా. ఇక లేరంటే బాధగానే ఉంది. కానీ నా ప్రస్తుత బాధకు మరో ప్రత్యేక కారణం ఉందిలేరా..’
`మరి ఏంటీ ? విద్యుదాఖాతానికి గిద్దలూరులో, అదేరా మీ ఊర్లోనే దంపతులు కరెంట్ షాక్ కి గురై చనిపోయారంటగా. వారేమన్నా నీకు బంధువులా, అందుకనేనా ఈ విషాదం.??’
`వారేమీ బంధువులు గట్రా కాదులేరా…’
`ఆ తెలిసింది… మొన్నీమధ్య రాజమండ్రి పుష్కరఘాట్ లో జరిగిన తొక్కిసలాటకు ప్రతిపక్షనాయకులంతా చంద్రబాబుని దుమ్మెత్తిపోస్తుంటే , ఆ పార్టీ వీరకార్యకర్తగా నీకు బాధ కలిగే ఉంటుంది. అది ఇప్పుడు బయటకు వచ్చింది కదూ…’
`ఛత్ …కాదురా..’
`మరేంటో సరిగా చెప్పి తగలడు’ విసుక్కున్నాడు సుబ్బారావు.
పక్కనే పుల్లారావు భార్య అందుకుని చల్లగా చెప్పింది అసలు సంగతి.
`మరే అన్నయ్యగారూ, ఈయన ఇందాకే ఒక బ్రేకింగ్ న్యూస్ టివీలో చూశారు. అంతే ఇలా అయిపోయారు ‘
`నువ్వు కూడా సస్పెన్స్ లో పెట్టకు చెల్లెమ్మా, ఇంతకీ ఏంటది?’
`అదే, అన్నయ్యగారూ, పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రెండు రూపాయలు తగ్గించారట’
`అదేమిటమ్మా !! పెట్రోల్ ధరలు తగ్గితే సంతోషించాలేకానీ, ఇలా ఈ ఏడుపేంటీ ?’
పుల్లారావు మధ్యలో అడ్డుతగిలి, చంద్రముఖి సినిమాలో ఆత్మ ఆవహించిన గంగలాగా…
`కాదా, కాదా.. ఎవరిని అడిగి తగ్గించారు…ఆఁ ‘ అంటూ ఊగిపోవడం మొదలెట్టాడు.
`అదేంట్రా, ఆ ఊగుడేంటీ, చాల్లే తగ్గు…అయినా పెట్రోల్ తగ్గించాలన్నా, పెంచాలన్నా నిన్ను అడగాలా ఏంటీ ‘
కూలైన తర్వాత పుల్లారావ్ గుండెల్లో బాధను దిగమింగుకుంటూ,
`అది కాదురా… ముందుగా తెలిస్తే ఇంత ఘోరం జరిగేది కాదుగా..అదీ నా బాధ…’
వాళ్లావిడ అందుకుంటూ…
`అదేనండీ, నిన్ననే మా వారు ఒకటా రెండా..ఏకంగా 20 లీటర్ల పెట్రోల్ ని కారులో పోయించారు. తీరా పోయించాక ఇప్పుడేమో లీటర్ కు రెండు రూపాయలు తగ్గించారంటూ ఈ వార్త వచ్చిపడింది’ పుల్లారావ్ బాధను కంటిన్యూ చేస్తూ…
`అంటే, 40 రూపాయలు నష్టంరా… ఈ పూట….’ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు.
`ఓరేయ్ ఆపరా నీ ఏడుపు. చూడలేక చస్తున్నా.. అయితే ఈ పెట్రోల్ డీల్ లో నీకు 40 రూపాయలు నష్టం వచ్చిందంటావ్, సరే మరి, నువ్వు పెట్రోల్ ట్యాంక్ నిండా పోయించుకున్న మర్నాడే ధర పెరిగిందనుకో అప్పుడు నీ ఫీలింగ్…’
పుల్లారావు వాళ్లావిడ జోక్యం చేసుకుంటూ,
`అప్పుడా అన్నయ్యగారూ, నన్నడగండి నేను చెబుతా.. బండికి రెండు ట్యాంక్ లు ఎందుకు లేవా అని తెగ బాధపడిపోతారు ఈయన గారు’ అంటూ పకపకా నవ్వేస్తూ, వాళ్లాయన్ని కూడా మామూలు మూడ్ లోకి తీసుకువచ్చింది.
`అంటే, పెట్రోల్ ధర తగ్గినా, పెంచినా ఈ ఏడుపు తప్పదన్నమాట’
పుల్లారావు వైపు తిరిగి గొంతు పెంచుతూ…
`ఒరేయ్, బియ్యం ధర పెరిగిందని ఇంటినిండా బస్తాల కొద్దీ బియ్యం కొంటామట్రా, అలాగే, పెట్రోల్ ధర రేపటి నుంచి పెరుగుతుందంటే ఇవ్వాళే ఎన్ని ట్యాంకులు నింపగలం చెప్పు. అర్థరాత్రి నుంచి పెట్రోల్ ధర పెరుగుతుందంటే చాలు మనలాంటి మధ్యతరగతి వాళ్లం పెట్రోల్ బంక్ ల వద్ద క్యూలు కట్టడం సహజమే. పెట్రోల్ ధరలు పెరగకుండా ఈ ప్రభుత్వాలను కట్టడిచేయలేని మనం కేవలం మన బండి ట్యాంక్ లో పెట్రోల్ చూసుకుని సంతృప్తిపడే అల్పజీవులంరా. కానీ, ఒరేయ్, పెట్రోల్ ధర తగ్గినా ఇలా నువ్వు ఏడుపు లంఖించుకుంటే చుట్టుపక్కల వాళ్లు నిన్ను పిచ్చోడనుకుంటారు. ఇక చాల్లే ఆపేయ్. ఇప్పుడు వచ్చిన నష్టాన్ని మరో సారి పూడ్చుకుని సంతోషపడటం నేర్చుకో. అదే మధ్యతరగతి ఆనంద ఫార్ములా.గుర్తుపెట్టుకో, మరి నేను వస్తా, ఆఁ వస్తా చెల్లెమ్మా…’ అంటూ సుబ్బారావు చల్లగా జారుకున్నాడు.

కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కట్‌ చేసిన జీతాలు,పెన్షన్లను 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే..!

కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం...

జగన్ అనుకుంటే అంతే.. ! ఎమ్మెల్సీ టిక్కెట్ ఆయన కుమారుడికి..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే ఇట్టే నిర్ణయం తీసుకుంటారు. దానికి ముందూ వెనుకా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. దానికి తాజాగా మరో ఉదాహరణ ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపిక. రాజ్యసభకు...

వైసీపీలోనూ అలజడి రేపుతున్న రాపాక..!

జనసేన తరపున గెలిచి తాను వైసీపీ మనిషినని చెప్పుకుంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీలోనూ చిచ్చు పెడుతున్నారు. రాజోలు వైసీపీలో మూడు గ్రూపులున్నాయని.. అందులో తనది ఒకటని స్వయంగా...

బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్...

HOT NEWS

[X] Close
[X] Close