కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనికా ఇటీవల మాత్రం వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణం అవుతుందని అంగీకరించింది. ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విదేశాల్లో న్యాయపోరాటం కూడా ప్రారంభించారు.

అస్ట్రాజెనికా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్ , ప్లేట్ లెట్స్ హెచ్చు తగ్గుదలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్,సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో విరివిగా వినియోగించారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ వలన థ్రోంబోసైటోపెనియా అనే సిండ్రోమ్‌కు గురవ్వడం ద్వారా శరీరంలో రక్తం గడ్డ కట్టడం లేదా ప్లేట్‌లెట్స్ కౌంట్ వేగంగా పడిపోవడం జరుగుతోంది. రక్తం గడ్డకట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.ఇటీవలి గుండె సంబంధిత వ్యాధులకు వ్యాక్సిన్లే కారణమని అందుకు సంబంధించిన వివరాలను వ్యాక్సిన్‌ అనే సైన్స్‌ జర్నల్‌లో నివేదించారు.

వ్యాక్సిన్ ప్రభావాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అధ్యయనం బృందానికి నాయకత్వం వహించిన డా. మల్హోత్రా అధ్యాయానికి సంబంధించి పూర్తి వివరాలను పీర్ రివ్యూడ్ జోర్నల్ లో ప్రచురించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, ఫైజర్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కన్నా ప్రమాదకరమని..ఇది గుండెజబ్బులకు దారితీస్తోందని పేర్కొన్నారు.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా జర్మనీ డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు నిషేధించినప్పుడు ఇండియాలో ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ వ్యాక్సిన్ వినియోగం కారణంగా రక్తంలో క్లాట్స్ వచ్చినట్లు గుర్తించామని డాక్టర్ మల్హోత్రా వివరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close