ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే సైలెంట్ గా పూడ్చి పెట్టుకోవాలి కానీ.. గోల చేయకూడదు. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఉంటాయి. కానీ నిజ జీవితంలో ఉంటాయని అనుకోలేరు. ఓ ఊరిలో అలా చేయగలుగుతారేమో కానీ ఓ జిల్లా లేదా రాష్ట్రం మొత్తం చేయలేరని అనుకుంటారు.కానీ గత ఐదేళ్ల ఆంధ్రప్రదేశ్ ని అందులో మద్యం వ్యాపారాన్ని చూస్తే.. మన దేశంలో ఒక్క సారి పరిపాలన చేతికి వస్తే ఇంత నిర్లజ్జగా ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి దోపిడీ చేయవచ్చా అని ఆశ్చర్యపోతారు. ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా సాగిన మద్యం దోపిడీది మరో చరిత్ర.

మద్య నిషేధం పేరుతో అధికారంలోకి రాగానే షాపులన్నింటినీ ప్రభుత్వ పరం చేశారు. ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజలనుకుంటారు.కానీ ప్రజలు అధికరం ఇచ్చారు కాబట్టి అది తనవేనని జగన్ నమ్మకం. అందుకే మద్యం దుకాణాల్ల ఏ ఇతర బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేశారు. అన్నీ తన బ్రాండ్లే అమ్మారు. తన వాళ్లే అమ్మారు. తమ వాళ్లే ట్రాన్స్ పోర్టు చేశారు. తమ వారే తయారు చేశారు. అంటే.. ఏ టూ జడ్ జగన్ మోహన్ రెడ్డి గుప్పిట్లోనే మద్యం వ్యాపారం సాగింది. ఐదేళ్లలో లక్షన్నర కోట్ల వ్యాపారం. అంతా నోట్ ద్వారానే సాగింది. ఇదే అసలు దందా అనుకుంటే.. బ్లాక్ దందా మరోకటి. వైసీపీ నేతల వ్యాపారాల్లో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముకోవడం అనేది చాలా ప్రధానమైన ఆదాయవనరు. ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

ఈ చీప్ లిక్కర్ ధర మహా అయితే ఇరవై ఉంటుంది. కానీ రెండు వందకు అమ్ముతున్నారు. ఇలా ఏంటి అంటే.. షాక్ కొట్టే ధరుల పెట్టడం వల్ల మద్యం తాగే వారు తగ్గిపోతారట. ఈ లాజిక్ చెప్పి పేదల రక్తాన్ని పిండేశారు. కాయకష్టం చేసుకునేవాళ్లు కాస్త మద్యం తాగి నొప్పుల్ని మర్చిపోతారు. అలాంటి వాళ్ల ఆదాయాన్ని పీల్చేసుకున్నారు. మళ్లీ మద్యం వినియోగం తగ్గిందని కబుర్లు చెబుతున్నారు. ఆ తగ్గిన వినియోగానికి డబుల్.. బ్లాక్ లో వైసీపీ నేతలు అమ్ముకున్నారు.

వైసీపీ ప్రభుత్వం అమ్మకుంటున్న మద్యం వల్ల.. కొన్ని వేల మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. మద్యమే కారణమని నివేదికలు చెబుతున్నా ఒక్కరూ పట్టించుకోవం లేదు. పేదల ఆర్థికత పరిస్థితిని చితికిపోయేలా చేసి వారి ఆరోగ్యాన్ని గుల్ల చేసి .. మద్యం విధానంతో ఏపీని శ్మశానం చేస్తోంది వైసీపీ. మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రజలు ఈ విధానాన్ని అంగీకిరంచారని మరింతగా బరి తెగిస్తారు. ఊళ్లను వల్లకాడుగా చేస్తారు.

మద్యనిషేధం ఈ రోజుల్లో అసాధ్యం. అందుకే బాధ్యతగా మద్యం విధానాన్ని అనుసరించే ప్రభుత్వం రావాలి. సొంత మద్యం అమ్ముకునే పాలకులు రక్తం పీల్చేస్తారు. ఇప్పటికే మద్యం దుకాణాల వల్ల ఎన్ని తిట్లు తిడుతూంటే అక్కడి వారికే తెలుసు. వారి కుటుంబాలు ఎంతగా చితికిపోయాయో వారికే తెలుసు. అందుకే ఓటేసే ముందు .. మద్యం తో బతుకుల్ని ఛిద్రం చేసుకున్న పేదల గురించి.. మద్యనిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి.. రక్తమాంసాలు పిండుకున్న పాలకుల గురించి ఓ సారి ఆలోచించి ఓటేయండి. మరో సారి తప్పు చేస్తే ప్రస్తుత తరానికి..భవిష్యత్ తరానికి హాని చేసినట్లే !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close