ఆర్‌.ఆర్‌.ఆర్‌: చివ‌రి 40 నిమిషాలూ యాక్ష‌న్ థ‌మాకా

2022లోనే బిగ్గెస్ట్ రిలీజ్ `ఆర్‌.ఆర్.ఆర్‌`. నిజానికి 2021లోనే ఈ సినిమా రావాల్సింది. కానీ ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. ఈ సంక్రాంతికి బొమ్మ ప‌డాల్సింది. కానీ అప్పుడూ కుద‌ర్లేదు. ఈ వేస‌విలో `ఆర్‌.ఆర్‌.ఆర్‌` రావ‌డం ఖాయ‌మైపోయింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఈ సినిమా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో యాక్ష‌న్ ఓ రేంజ్‌లో ఉండ‌బోతోంద‌న్న విష‌యం ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైపోతుంది. మ‌రీ ముఖ్యంగా రెండు యాక్ష‌న్ సీక్వెన్స్‌పై చిత్ర‌బృందం ఆశ‌లు పెంచుకుంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ లో వ‌చ్చే ఫైట్ ఈ క‌థ‌కు చాలా కీల‌కం. ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ ల మ‌ధ్య ఈ ఫైట్ ఉండ‌బోతోంది. ఈ ఫైట్ కోసం చాలా ఖ‌ర్చు పెట్టారు కూడా. క్లైమాక్స్ ఫైట్ అయితే దీనికి మించి ఉండ‌బోతోంది. సాధార‌ణంగా ఏ సినిమాకైనా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ రెండు ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ ఎమోష‌న్‌తోనూ, క్లైమాక్స్‌యాక్ష‌న్ తోనూ న‌డిపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ రెండింటిలోనూ యాక్ష‌నే ఉండ‌బోతోంద‌ని టాక్‌. క్లైమాక్స్ ఫైట్ దాదాపుగా 40 నిమిషాలు ఉంటుంద‌ని, ఈఒక్క ఫైట్ కోస‌మే మొత్తం బ‌డ్జెట్ లో 30 శాతం వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. సెకండాఫ్‌లో స‌గం సినిమా కేవ‌లం యాక్ష‌న్ సీక్వెన్స్‌తోనే న‌డిపించాడ‌ట‌. బాహుబ‌లిలో చివ‌రి 40 నిమిషాలూ ఇలానే క్లైమాక్స్ ఫైట్ గా మార్చాడు. అక్క‌డ యుద్ధం కాబ‌ట్టి.. ర‌క‌ర‌కాల సీక్వెన్స్‌లు చూపించే వీలు ద‌క్కింది. ఆర్‌.ఆర్‌.ఆర్ లో యుద్ధం ఏమీ ఉండ‌దు. సాధార‌ణ యాక్ష‌న్ సినిమాల్లో చూపించే ఫైట్ సీక్వెన్స్ నే చూపించాలి. అలాంటి ఫైట్ ని 40 నిమిషాల పాటు వెండి తెర‌పై చూపిస్తూ, ప్రేక్ష‌కుల్ని కూర్చోబెట్ట‌డం అంటే మాట‌లు కాదు. కాక‌పోతే… ఇలాంటి విష‌యాల్లో రాజ‌మౌళి మాస్ట‌ర్‌. ఫైట్‌లోనే ఎమోష‌న్ ని కూడా మిక్స్ చేయ‌గ‌ల‌డు. త‌న‌కు ఇదంతా కొట్టిన పిండే. పైగా తెర‌పై క‌నిపించేది ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు కాబ‌ట్టి.. ఆ ఫైట్ ఎంత సేపు చూసినా బోర్ కొట్ట‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాడిన 9 ఫోన్లు ఈడీకి సమర్పించిన కవిత !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత 9 ఫోన్లను మార్చారని చేశారని ... డిల్స్ మాట్లాడుకున్న ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ చేస్తున్న ఆరోపణలకు ఆమె స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చారు. తాను ఫోన్లు...

మ‌నిషి ప్రాణాల‌తో ఆడుకోవ‌ద్దు: కోట శ్రీ‌నివాస‌రావు ఆవేద‌న‌

ఈరోజు ఉద‌య‌మే ఓ దుర్వార్త‌. కోట శ్రీ‌నివాస‌రావు మ‌ర‌ణించార‌ని. సోష‌ల్ మీడియాలో ఇదే.. హాట్ టాపిక్‌. అయితే ఇది అచ్చంగా ఫేక్ వార్త‌. కోట ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడు ఓ వీడియో కూడా...

మోసగాళ్లకు ఏపీ ప్రభుత్వం అంత ఈజీగా కనిపిస్తోందా ?

ఏకంగా సీఎం జగన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లో తాను జగన్ పీఏనని చెప్పి పారిశ్రామికవేత్తల్ని కోట్లలో ముంచాడు బుడమూరు నాగరాజు అనే మోసగాడు. ఈయన ఇలా మోసాలు...

రివ్యూ : రంగమార్తాండ

Rangamarthanda review రేటింగ్‌: 2.75/5 గులాబి నుంచి నక్షత్రం వరకూ 20 సినిమాలు చేశారు కృష్ణ వంశీ. ఇందులో కొన్ని క్లాసిక్స్, కొన్ని విజయాలు, ఇంకొన్ని అపజయాలు వున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఆయన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close