” హెల్లో లోకేష్” అదుర్స్ !

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కొత్తగా “హెల్లో లోకేష్” అనే కాన్సెప్ట్ ను డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో యువతను భాగం చేశారు. పెద్దగా ప్రచారం చేయకపోవడంతో మామూలు బహిరంగసభే అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఓ నాయకుడు తన విజన్ ను ప్రజల ముందు పెట్టేందుకు పక్కా ఏర్పాటు అధి. అద్భుతమైన ఏర్పాట్లు అంతకు మించి నాయకుడిలో స్పష్టత వెల్లడయింది. తిరుపతిలో నిర్వహించిన హెల్లో లోకేష్ కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఇచ్చిన ఆన్సర్లు .. లోకేష్ లో ఉన్న క్లారిటీని ప్రజల ముందు ఉంచింది.

హెల్లో లోకేష్ కార్యక్రమం అంటే ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించి ఏవో నాలుగు హామీలిచ్చి వెళ్లిపోయే రొటీన్ బహిరంగసభ కాదు. యువత అనుమానాలు.. సందేహాలను స్వయంగా తీల్చే కార్యక్రమం. యువత ప్రశ్నలు వేస్తే వాటికి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఏ ప్రశ్నలు వేయాలన్నది ముందుగా డిసైడ్ చేసేది కాదు. ఎలాంటి ప్రశ్నలైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యే ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి , ఆర్థిక పరిస్థితి, నిధులు, విధులతో పాటు రాజకీయ అంశాలపైనా యువత అడిగిన అన్నిప్రశ్నలకూ లోకేష్ స్పష్టమైన సమాధానాలిచ్చారు. తన విజన్ ను ఆవిష్కరించారు.

జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ విషయంలోనూ తన స్పష్టమైన అభిప్రాయాలను చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హెల్లో లోకేషే కనిపిస్తోంది. ట్రోలింగ్ పేరుతో వైసీపీ సోషల్ మీడియాకూడా తన వంతుకు సాయం చేస్తోంది. మొత్తంగా యువ నేత లోకేష్.. యువ గళం వినిపించే దిశగా.. కీలకమైన అడుగులు వేస్తున్నారు. యువతలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. యువత ఆలోచనలు.. మనోభావాలకు తగ్గట్లుగా రాజకీయం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

నారా లోకేష్ పాదయాత్ర నెల రోజులకు దగ్గర అవుతోంది. కుప్పం నుంచి ప్రారంభిచి చిత్తూరు వరకూ వచ్చారు. ఇప్పటికే పాదయాత్ర డిఫరెన్స్ ఏంటో.. టీడీపీ నేతలకు అర్థమవుతోంది. వైసీపీ కొన్ని వేల మందిని పెట్టుకుని .. ఇంటలిజెన్స్ పోలీసుల్ని ఉపయోగించుకుని ఎంత దుష్ప్రచారం చేసినా… గ్రౌండ్‌లో మాత్రం వేరుగా ఉంటోంది. ఇది ఎప్పటికప్పుడు ప్రజలకు క్లారిటీ వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close