పార్టీలో గొడ‌వ ప‌డ్డ హీరో – ద‌ర్శ‌కుడు

సినిమా ఇండ‌స్ట్రీలో పార్టీలు ఇచ్చి పుచ్చుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. వీకెండ్ వ‌చ్చిందంటే ఎక్క‌డో ఓ చోట ఏదో ఓ పార్టీ జ‌రుగుతూనే ఉంటుంది. కొన్ని పార్టీలు మాత్రం ఇన్ సైడ్ వ‌ర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటాయి. అలాంటి ఓ పార్టీ ‘గొడ‌వ‌’ ఇది. ఓ అగ్ర హీరో కుమార్తె ఇండ‌స్ట్రీలోని త‌న‌కు తెలిసిన స‌ర్కిల్ కి ఓ పార్టీ ఇచ్చింది. అందులో ద‌ర్శ‌కులు, హీరోలు, కొంత‌మంది ప్ర‌ధానమైన టెక్నీష‌య‌న్లు పాల్గొన్నారు. పార్టీ ఓ లెవ‌ల్ వ‌ర‌కూ బాగానే జ‌రిగింది. వ‌చ్చిన వాళ్ల‌లో చాలామంది వెళ్లిపోయారు కూడా. కానీ తెల్లార్లూ ఎంజాయ్ చేసే బ్యాచ్ ఒక‌టి ఉంటుంది క‌దా. అలాంటి బ్యాచ్‌లో కొంత‌మంది మిగిలారు. వాళ్ల‌లో ఓ ద‌ర్శ‌కుడు, హీరో కూడా ఉన్నారు. వారిద్ద‌రికీ పూర్వ ప‌రిచ‌యం ఉంది. ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమా కూడా చేశారు. మాట‌ల మ‌ధ్య‌లో ‘నేనే నీకు బ్రేక్ ఇచ్చా’ అన్నాడు ద‌ర్శ‌కుడు. ఆ హీరోకి మండింది. ‘అప్ప‌టికి నువ్వు అట్ట‌ర్ ఫ్లాప్ తీసిన బాధ‌లో ఉన్నావ్. అందుకే నీకు ఛాన్స్ ఇచ్చా’ అన్నాడు హీరో. అలా.. ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌గా మొద‌లైన గొడ‌వ‌.. పెద్ద‌దైపోయింది. ఒకరి జాక‌తాల చిట్టా మ‌రొకరు విప్పుకొంటూపోయారు. దాంతో ఇదెక్క‌డిగొడ‌వ‌రా బాబూ.. అంటూ పార్టీకి వ‌చ్చిన‌వాళ్లంతా త‌ల‌లు ప‌ట్టుకొన్నారు. ఎంత‌మంది స‌ర్ది చెప్పాల‌నుకొన్నా వాళ్లిద్ద‌రూ విన‌లేదు. మ‌ధ్య‌వ‌ర్తులుగా నిల‌వ‌లేక చాలామంది వ‌దిలేసి వెళ్లిపోయారు. చివ‌రికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆ హీరో కూతురు కూడా ‘తాగితే వీళ్లిద్ద‌రూ ఇలా ప్ర‌వ‌ర్తిస్తారా’ అంటూ విస్తుపోయింద‌ట‌. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం తెల్లారే స‌రికి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయిపోయింది. ఇక మీద పార్టీలు ఇద్దాం అనుకొనే వాళ్లు ‘వీళ్లిద్ద‌ర్ని మాత్రం పిల‌వ‌కూడ‌దు’ అని గ‌ట్టిగా ఫిక్స‌వుతున్న‌ట్టు టాక్‌. ఆ ఇద్ద‌రూ ఎవ‌ర‌నేదా సందేహం. ఓ చిన్న క్లూ. పార్టీ ఇచ్చిన హీరో కుమార్తె.. గొడ‌వ ప‌డ్డ హీరోకు చాలా ద‌గ్గ‌రి చుట్టం. ఆ ద‌ర్శ‌కుడేమో… ఆ ఫ్యామిలీ హీరోతో ఆల్రెడీ ఓ సినిమా చేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరివీ..? ఎందుకీ అస్పష్టత..?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో...

ఎంపీ ఎన్నికలు…హైదరాబాద్ లో కర్ఫ్యూ..!!

హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళడంతో నగరమంతా బోసిపోయింది. ఇది హైదరాబాదేనా అనుమానం వచ్చేలా హైదరాబాద్ నిర్మానుష్యంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close