డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికేసిన హీరో

మ‌ద్య‌పానం – ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం, క్యాన్స‌ర్‌కు కార‌కం అంటూ సినిమా మొద‌ట్లో మైకు ప‌ట్టి అరుస్తుంటారు హీరోలు. కానీ వాళ్లే మ‌ద్యానికి బాసిన అవుతున్నారు. తాగ‌డ‌మే కాదు. తాగి… డ్రైవ్ చేస్తున్నారు కూడా. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన న‌టీన‌టులు ఎంతోమంది. ఇప్పుడు ప్రిన్స్ కూడా ఆ లిస్టులో చేరిపోయాడు. తేజ `నీకు నాకు డాష్ డాష్‌` సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్‌. బ‌స్ స్టాప్ లాంటి సినిమాల్లో న‌టించాడు. నేను శైల‌జ‌లో ఓ కీల‌క పాత్ర పోషించాడు. బిగ్ బాస్ 1కి కూడా వెళ్లొచ్చాడు. ఇప్పుడు త‌నే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయాడు. సోమ‌వారం రాత్రి కూక‌ట్ ప‌ల్లిలో నిర్వ‌హించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసుల‌కు దొరికాడు ప్రిన్స్‌. పోలీసులు కారుని సీజ్ చేసి ప్రిన్స్‌పై కేసు న‌మోదు చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం కూక‌ట్ ప‌ల్లి కోర్టుకి ప్రిన్స్ హాజ‌ర‌య్యాడు కూడా. ఎవ‌రూ త‌న‌ని గుర్తు ప‌ట్ట‌కుండా వుడీ ధ‌రించి వ‌చ్చి, మొహాన్ని క‌వ‌ర్ చేసుకుందామ‌నుకున్నా.. కెమెరా క‌ళ్లు అత‌న్ని ప‌ట్టేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close