స‌రిలేరు నీకెవ్వ‌రు.. మూడు గంట‌ల సినిమానా?

ఈమ‌ధ్య లెంగ్త్ విష‌యంలో హీరోలు, ద‌ర్శ‌కులు చాలా క్లారిటీతో ఉన్నారు. సినిమా ఇంతకు మించ‌కూడ‌దు అంటూ స్కేళ్లు ప‌ట్టుకుని మ‌రీ రెడీ అవుతున్నారు. అయినా రంగ‌స్థ‌లం లాంటి లెంగ్తీ సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. సినిమాలో విష‌యం ఉంటే, ఎంత లెంగ్త్ ఉన్నా చ‌ల్తా. కాక‌పోతే… ఒక్కోసారి నిడివి భార‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. అందుకే ఈ విష‌యంలో అంత జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

అయితే స‌రిలేరు నీకెవ్వ‌రు మాత్రం 3 గంట‌ల సినిమాగా రూపుదిద్దుకోనుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన అవుట్ పుట్‌, తీయాల్సిన పాట‌లు ఇవ‌న్నీ క‌లుపుకుంటే ఈ సినిమా మూడు గంట‌ల వ‌ర‌కూ ఉండొచ్చ‌ని ఓ అంచ‌నా. అనిల్ రావిపూడికి కామెడీ పై మంచి ప‌ట్టుంది. ద్వితీయార్థంలో కామెడీ సీన్లు బాగా పండాయ‌ట‌. వాటి వ‌ల్ల లెంగ్త్ ఎక్కువైంద‌ని తెలుస్తోంది. ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర ఈ సినిమాని ట్రిమ్ చేసి క‌నీసం 15 నిమిషాలైనా క‌త్తిరించాల్సిన ప‌రిస్థితి. కాక‌పోతే… ఆ బాధ్య‌త దిల్‌రాజు తీసుకుంటున్నారు. దిల్‌రాజు జ‌డ్జిమెంట్ బాగుంటుంది. క‌థ‌కు అవ‌స‌రం లేద‌నుకుంటే ఆయ‌న నిర్దాక్ష‌ణ్యంగా క‌ట్ చేస్తుంటారు. సినిమా బాగా ఆడితే, ఆ త‌ర‌వాత ఆయా సన్నివేశాల్ని క‌లుపుకుని, ఆ త‌ర‌వాత‌.. ఆ రూపంలో మ‌రిన్ని వ‌సూళ్లు పెంచుకోవాల‌న్న‌ది ప్లాన్‌. మ‌హ‌ర్షికీ ఇలానే నిడివి ఓ స‌మస్య‌గా మారింది. ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కొన్ని సన్నివేశాల్ని క‌ట్ చేశారు కూడా. సినిమా హిట్ట‌య్యింది కాబ‌ట్టి.. లెంగ్త్ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌రిత్ర సృష్టించిన ధావ‌న్

ఐపీఎల్ లో మ‌రో రికార్డ్ న‌మోద‌య్యింది. ఈసారి శేఖ‌ర్ ధావ‌న్ వంతు. ఐపీఎల్ లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ధావ‌న్ రికార్డు సృష్టించాడు. ఓ బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో...

జాతికి జాగ్రత్తలు చెప్పిన మోదీ..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మధ్యాహ్నం నుంచి ఉత్కంఠ రేపిన ఆరు గంటల ప్రసంగంలో కీలకమైన విధానపరమైన ప్రకటనలు ఏమీ లేవు. పండగల సందర్భంగా ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారని.. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు...

ఏపీకి విరాళాలివ్వట్లేదా..! జగన్ అడగలేదుగా..?

సినీ స్టార్లు, పారిశ్రామికవేత్తలు తెలంగాణకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల్లో పడిన హైదరాబాద్‌ను.. అక్కడి ప్రజలను ఆదుకోవడానికి సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలివ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలా పిలుపునిచ్చారో...

కేసీఆర్ పిలుపు… విరాళాల వెల్లువ..!

ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడంతో పాటు పెద్ద ఎత్తన ధ్వంసం అయిన రోడ్లు, విద్యుత్...

HOT NEWS

[X] Close
[X] Close