హీరోయిన్ కోసం హీరోగారి రిక‌మెండేష‌న్లు

ఆయ‌న ఓ స్టార్ హీరో. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చాడు. కాక‌పోతే.. ఆ డాంబికాలు ఎప్పుడూ చూపించ‌లేదు. `ఫ‌లానా హీరోయిన్ నే తీసుకోండి..` అనే రిక‌మెండేష‌న్లు ఎప్పుడూ చేయ‌లేదు. కానీ ఓ క‌థానాయిక విష‌యంలో మాత్రం ఆయ‌న మ‌రీ… అతి శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. ఓ హీరోయిన్ తో గ‌తంలో ఓ సినిమా చేశాడీయ‌న‌. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా చ‌నువు పెరిగింది. ఆ హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్లి, కుటుంబ స‌భ్యుల‌తోనూ స్నేహం చేయించేంత అనుబంధాన్ని పెంచుకున్నాడు. తాను చేస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ల గురించి క‌స‌ర‌త్తు సాగుతున్న‌ప్పుడు `ఆమెను తీసుకోండి` అని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు గ‌ట్టిగా రిక‌మెండ్ చేశాడు. హీరో చెప్పాడు కాబ‌ట్టి, త‌ప్ప‌లేదు. దాంతో ఈ కాంబో మ‌రోసారి సెట్ట‌య్యింది.

నిర్మాత‌తోనూ ప‌ర్స‌న‌ల్ గా మాట్టాడి పారితోషికం గ‌ట్టిగా ఇప్పించాడ‌ని టాక్‌. ఆ క‌థానాయిక అర్హ‌త‌ను, సామ‌ర్థ్యానికి మించిన పారితోషికం హీరో రిక‌మెండేష‌న్ తో ఇప్పించాల్సివ‌చ్చింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యమై హీరోపై స‌దరు నిర్మాత కాస్త గుర్రుగానే ఉన్నాడ‌ట‌. ఇదంతా ఒక ఎత్తు. సెట్లో ఆ హీరో – హీరోయిన్ల వ్య‌వ‌హార శైలి మ‌రో ఎత్తు. వాళ్ల అనుబంధం చూస్తుంటే ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో ఉందేమో..? అన్నంత అనుమానాలు రేగుతున్నాయ‌ట‌. ఆ హీరోయిన్ ది హైద‌రాబాద్ కాదు. కానీ మ‌కాం, త‌దిత‌ర సౌక‌ర్యాల‌న్నీ హీరోగారే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ అనుబంధం ఎంత కాల‌మో మ‌రి..?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close