సందీప్ రెడ్డి తో ప్ర‌భాస్ 25 ఫిక్స్‌.. టైటిల్ ఇదే!

ప్ర‌భాస్ 25వ సినిమా ఫిక్స‌య్యింది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి `స్పిరిట్‌` అనే పేరు ఫిక్స్ చేశారు. యూవీ క్రియేష‌న్స్‌, టీ సిరీస్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాయి. 8 భాష‌ల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంత‌ర్జాతీయంగానూ ఈ సినిమాని విడుద‌ల చేస్తారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న 25వ సినిమా ఇది. అందుకే ఈ సినిమాని మ‌రింత గ్రాండ్ గా రూపొందించాల‌న్న‌ది ప్లాన్‌. ప్ర‌భాస్ చేతిలో రాధేశ్యామ్, ఆది పురుష్‌, స‌లార్ సినిమాలున్నాయి. నాగ అశ్విన్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్ర‌భాస్‌. ఇవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చిన త‌ర‌వాతే… స్పిరిట్ మొద‌ల‌వుతుంది.

* మ‌హేష్‌కి చెప్పిన క‌థ ఇదే!

అర్జున్ రెడ్డి త‌ర‌వాత సందీప్ రెడ్డి వంగాకి చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. మ‌హేష్ బాబు సైతం పిలిచి మాట్లాడాడు. ఓ సినిమా చేద్దాం అని ఆఫ‌ర్ ఇచ్చాడు. ఈ కాంబో దాదాపుగా సెట్ అయ్యేదే. కానీ క‌థ విష‌యంలో మ‌హేష్ కి చిన్న పాటి క‌న్‌ఫ్యూజ‌న్లు ఉండ‌డంతో ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింది. అప్పుడు మ‌హేష్ కోసం రాసుకున్న క‌థ‌నే.. ఇప్పుడు ప్ర‌భాస్ తో తీస్తున్నార‌ని స‌మాచారం. సో.. క‌థెప్పుడో రెడీ. దానికి చిన్న‌పాటి మెరుగులు దిద్దడ‌మే బాకీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ .. “రెడ్డి భజన” ఉపయోగమేనా !?

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో కులం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన అందర్నీ దువ్వుతున్నారు. మనమేంది.. మన చరిత్రేంది.. అంటూ...

బాల‌కృష్ణ‌.. అనిల్‌ రావిపూడి.. సినిమా ఎలా ఉంటుందంటే?

టాలీవుడ్ లో మ‌రో ఆస‌క్తి క‌ర‌మైన కాంబినేష‌న్ సెట్ అయ్యింది.. అదే నంద‌మూరి బాల‌కృష్ణ - అనిల్ రావిపూడిల‌ది. ఎఫ్ 3 త‌ర‌వాత‌.. అనిల్ రావిపూడి చేయ‌బోయే సినిమా ఇదే. ప్ర‌స్తుతం గోపీచంద్...

కోనసీమ పేరు మార్పు చిచ్చు – అట్టుడికిన అమలాపురం !

కోనసీమ జిల్లా పేరు మార్చడంపై ఆ జిల్లా మొత్తం అట్టుడికి పోతోంది. మెల్లగా ప్రారంభమైన ఆందోళనలు ఉద్ధృత స్థాయికి చేరాయి. చివరికి అవి రాళ్ల దాడులకు దారి తీశాయి. ఎస్పీ సుబ్బారెడ్డి సహా...

సీపీఎస్ రద్దు లేనే లేదు.. తేల్చేసిన ఏపీ సర్కార్ !

ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. వారంలో సీపీఎస్ రద్దు అన్న జగన్ హామీని తీసి పజేసింది. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో పాత పింఛన్‌ విధానం అమలు సాధ్యం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close