హీరో సుమన్ ఒకప్పుడు తెలుగులో టాప్ హీరో. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ అగ్ర స్థానాన్ని కోల్పోయారు. తర్వాత గంగోత్రి తో క్యారక్టర్ నటుడిగా మారి, చాలా సినిమాల్లో నటిస్తున్నారు. మొదటినుంచీ కెసీయార్ కి తెలంగాణా ఉద్యమానికీ మద్దతుదారుడిగా ఉన్నారు. సకల జనుల సమ్మె సమయం లో తానూ ఉద్యమం లో పాల్గొన్నారు. ఇప్పుడు ఉత్తర దక్షిణ భారత దేశాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని అందరూ భావిస్తున్న సమయం లో కొత్త ప్రతిపాదన తెచ్చారు.
దక్షిణాది వాసులకు ఉప ప్రధానమంత్రి పదవి ఇవ్వాలని సుమన్ కోరారు. దక్షిణాది రాష్ట్రాల పై జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తర భారతానికి సంబంధించి మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున దక్షిణాది వారికి కేంద్ర క్యాబినెట్లో ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు సుమన్ . అలాగే రైతులకు 24 గంటల కరెంట్ సరఫరా , హెల్త్ కార్డులు వంటి పథకాల విషయం లో కెసియార్ ని కొనియాడారు
తెలంగాణా ఉద్యమ సమయం లో నూ ఆంధ్ర కి చెందినవారు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు తెలంగాణా కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవారు. అయితే దానివల్ల ఉపయోగం లేదని కెసీయార్, టీఆరెస్ తో పాటు తెలంగాణా ప్రజానీకం కూడా అభిప్రాయపడ్డారు. మరి ఆ లాజిక్ ప్రకారం, ఇప్పుడు దక్షిణాదికి ఉప ప్రధాని ఇచ్చినా అంతే కదా??