చివాట్లు పెట్టిన సుమంత్‌

మ‌ళ్లీ రావాతో కాస్త ఊపిరి పీల్చుకున్న‌ట్టే క‌నిపించిన సుమంత్‌.. ఇప్పుడు మ‌రీ వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కుంటున్నాడు. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ఇప్ప‌డు ఇదం జ‌గ‌త్ రెండూ ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురంకి కాస్తో కూస్తో ఓపెనింగ్స్ అయినా ద‌క్కాయి. ఇదం జ‌గ‌త్ అయితే మ‌రీ దారుణం. ఈ సినిమాకి స‌రైన ప‌బ్లిసిటీ లేకుండా పోయింది. సినిమా వ‌స్తోంద‌న్న సంగ‌తి క‌నీసం ఫిల్మ్ మీడియాకు కూడా తెలీదంటే.. ప‌రిస్థితి అర్థం చేసుకోవొచ్చు. ఇంత దారుణ‌మైన ప‌బ్లిసిటీ త‌న సినిమాకి ఎప్పుడూ లేద‌ని సుమంత్ ఇప్పుడు వాపోతున్నాడు.

ఈ విష‌య‌మై సుమంత్ నిర్మాత‌కు చివాట్లు పెట్టాడ‌ట‌. త‌న కెరీర్‌లో ఇంత దారుణ‌మైన ఓపెనింగ్స్ ఏ సినిమాకీ రాలేద‌ని, వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు కూడా మంచి ఓపెనింగ్సే ద‌క్కాయ‌ని, ప‌బ్లిసిటీ చేయ‌డానికి ఇష్టం లేక‌పోతే.. అస‌లు సినిమా ఎందుకు తీశార‌ని..? నిర్మాత‌కు చివాట్లు పెడుతూ ఓ లేఖ రాశాడ‌ట‌. ప‌బ్లిసిటీ విష‌యంలో ఇంత నిర్ల‌క్ష్యం చేస్తార‌ని తాను అనుకోలేద‌ని, క‌నీసం ఆ బాధ్య‌త త‌న‌కు అప్ప‌గించినా బాగుండేద‌ని ఆ లేఖ‌లో పేర్కొన్న‌ట్టు సన్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదం జ‌గ‌త్‌పై సుమంత్ చాలా న‌మ్మ‌కంగా ఉండేవాడు. ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయ‌లేద‌ని, ఇది క్ష‌ణం త‌ర‌హా సినిమా అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసేవాడు. కానీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర స‌రైన ఫ‌లితం రాక‌పోవ‌డంతో త‌న ఆవేద‌న‌ని నిర్మాత ముందు వెళ్ల‌గ‌క్కాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకలోనూ పచాయతీ ఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

హైదరాబాదీ.. కమాన్ లెట్స్ ఓట్..!

చదువుకున్న వాళ్లు ఓటు వేయరా..!? భారత దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. మెట్రో సిటీలు లేని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎనభై శాతం వరకూ ఉంటుంది. వ్యవసాయదారులు.. చిన్న వ్యాపారులు.. చిరు...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత..!

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల నర్సింహయ్య...

HOT NEWS

[X] Close
[X] Close