ఒక్క ఇల్లూ ఇవ్వలేదనేది జగన్ వాదన..! మరి సాక్షి 19 లక్షల ఇళ్లిచ్చారని చెబుతోందేంటి..?

రాజకీయాల్లో పాజిటివ్‌గా నెగెటివ్‌ కోణంలో ఆవిష్కరించి… ఆ ప్రకారం.. ప్రజల మనసుల్ని గెలుచుకోవడం…అనే ఓ కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి మనం చాలా సినిమాల్లో చూసి ఉంటారు. అవును.. అతడు చెడ్డ పనే చేశాడని.. మంచి పనులు ఏకరవు పెట్టడం. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సాక్షిలో చురుగ్గా అమలవుతున్నట్లుగా ఉంది. ప్రభుత్వంపై నిందలేయాలన్న ఆతృతతో.. ప్రభుత్వం పనితీరును చాలా గొప్పగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సాక్షి చెప్పిన వాటిలో అసలైన మ్యాటర్ చూస్తే.. ప్రభుత్వం ఇంత బాగా పని చేస్తోందా… అని అనిపించక మానదు. సినిమా మొత్తం హింస గురించి … చివరిలో..అలా చేయకూడదని చెప్పినట్లు… ఆర్టికల్ మొత్తం చంద్రబాబు గొప్పతనం.. పని తనం గురించి.. చివరిలో ప్రజలెవరూ ఇలా అనుకోవడం లేదు.. అని రాస్తే.. ప్రజల్లో మనసుల్లో పడే ముద్ర వేరే ఉంటుంది.

“ఇంటికో అవినీతి కథ” అంటూ సాక్షి పత్రికలో… ఎన్టీఆర్ గృహనిర్మాణాల గురించి ఓ పెద్ద కథనం రాసుకొచ్చింది. నిజానికి ఈ కథనానికి ప్రేరణ. ప్రభుత్వం భారీ ఎత్తున కట్టించిన ఇళ్లు.. వాటి దృశ్యాలతో టీవీల్లో చేసుకుంటున్న పబ్లిసిటీ కావొచ్చు. అదంతా ఉత్తదే.. దాని వెనుక చాలా అవినీతి ఉందని.. ప్రజల కష్టాలు ఉన్నాయని చెప్పుకుంటే.. వర్కవుట్ అవుతుందని అనుకున్నారేమో కానీ.. ఎలాంటి ఇళ్ల బొమ్మలు లేకుండా..లబ్దిదారుల పేరుతో కొన్ని ఫోటోలు వేసి… తమకు బిల్లులు రాలేదన్న అభిప్రాయాలు రాసుకొచ్చారు. టీడీపీ నేతల ప్రొద్భలంతో వేల మంది ఇళ్లు నిర్మించుకోవడం ప్రారంభించారని కూడా చెప్పుకొచ్చారు. అందులో ప్రత్యేకంగా పట్టిక వేసి.. ధరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇళ్లు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఆ పట్టిక ప్రకారం చూసినా.. వచ్చిన ధరఖాస్తుల్లో అర్హులవి మాత్రమే అంగీకరిస్తారు కాబట్టి.. ఫిల్టరింగ్‌లో కొన్ని పోతాయి. అది సహజమే.

అన్నింటికన్నా.. ఈ ఆర్టికల్‌లో అసలు విషయం ఏమిటంటే.. ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో దాదాపుగా 19 లక్షల ఇళ్లను నిర్మించించింది. ఇప్పటికే పదకొండున్నర లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందించింది. మరో ఏడు లక్షల ఇరవై వేల ఇళ్లు… వివిధ దశాల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇంత బాగా ప్రభుత్వం కూడా.. తన పనితీరు గురించి చెప్పుకోదు. కానీ సాక్షి చెప్పేసింది. అసలు కొసమెరుపేమిటంటే… జగన్మోహన్ రెడ్డి… కాళ్లు నొప్పి పుట్టేలా పాదయాత్ర చేస్తూ.. ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదంటూ… ఆరోపిస్తూ ఉంటారు. మరో వైపు సాక్షి మాత్రం.. ఇలా లక్షల్లో ఇళ్లు కట్టించి ఇచ్చారని చెబుతూ.. అక్కడక్కడ బిల్లులు అందలేదని.. టీడీపీ నేతల అవినీతి అని ముద్ర వేసేందుకు తాపత్రయ పడుతోంది. నిజానికి ఇది టీడీపీకి పాజిటివ్ ప్రచారమే. ఆరోపణలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.. కానీ ఇళ్లు కట్టించారన్న నిజం మాత్రం.. ఈ కథనంతో.. జగన్ కూడా ఒప్పుకున్నట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close