ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ కేసులో మోహిత్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహిత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. మద్యం కుంభకోణం కేసులో ఏ 39గా మోహిత్ రెడ్డి ఉన్నారు.
మద్యం డిస్ట్రిబ్యూటర్లు, సరఫరా కంపెనీల నుంచి అక్రమంగా వసూలు చేసిన ముడుపులను ఎన్నికల సమయంలో YSRCP అభ్యర్థులకు పంపిణీ చేయడంలో మోహిత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని SIT ఆరోపిస్తోంది. ముడుపుల నుంచి వచ్చిన అక్రమ డబ్బును రవాణా చేయడంలో మోహిత్ రెడ్డి పాలుపంచుకున్నారని.. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాహనాలను ఉపయోగించి ఈ డబ్బును రవాణా చేశారని ఆరోపణ సిట్ గుర్తించింది.
మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు ద్వారా అక్రమ డబ్బును వైట్ మనీగా మార్చారు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో సోదాలు జరిపి, విజయనంద్ రెడ్డి కంపెనీలతో లింకులు కనిపెట్టారు.మోహిత్ రెడ్డి రూ. 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పత్రాలు సృష్టించి మనీ లాండరింగ్ చేశారని సిట్ గుర్తించింది.
కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఉన్నందున మోహిత్ రెడ్డిని అరెస్టు చేయలేదు. ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్ప్డు ఆయనను అరెస్టు చేస్తారా లేకపోతే.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సమయం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.