రవిప్రకాష్‌కు ముందస్తు బెయిల్ …!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు అయింది. సుదీర్ఘ విచారణ అనంతరం.. హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. అయితే బెయిల్ విషయలో పలు షరతులు విధఇంచింది. వారానికోసారి సైబర్‌క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరుకావాలని.. ఆదే సమయంలో.. దేశం విడిచి వెళ్లిపోకూడదని రవిప్రకాశ్‌ను హైకోర్టు ఆదేశించింది. రవిప్రకాష్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలనుకున్న పోలీసుల ప్రయత్నాలకు.. హైకోర్టు తీర్పు చెక్ పెట్టినట్లయింది. టీవీ9 అమ్మకం వ్యవహారం వివాదాస్పదం అయిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రవిప్రకాష్‌ను.. టీవీ9 సంస్థ నుంచి తొలగించడమే కాకుండా… పలు కేసులను టీవీ9 కొత్త యాజమాన్యం… నమోదు చేసింది.

అందులో… కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం. లోగో అమ్మకం వంటి కేసులు ఉన్నాయి. వీటిపై విచారణకు పలు మార్లు రవిప్రకాష్ కు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. అరెస్ట్ చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రకటించారు కూడా. ఆ సమయంలో.. రవిప్రకాష్ ముందుగా… తనపై కేసులు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణకు తొందరేం లేదన్న హైకోర్టు.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అలా పిటిషన్ వేసుకున్నా.. విచారణలో నిలబడలేదు. దాంతో.. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు … నిర్ణయాన్ని హైకోర్టుకే వదిలేసింది. దాంతో.. మరోసారి విచారణ జరిపిన హైకోర్టు రవిప్రకాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లోపు రవిప్రకాష్.. పోలీసులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణకు హాజరైనప్పుడు… పోలీసులు.. రవిప్రకాష్ ఎలాంటి వివరాలు చెప్పడం లేదని మీడియాకు సమాచారం ఇచ్చారు. అందుకే అరెస్ట్ చేయాలనుకుంటున్నామని కూడా ప్రచారం చేశారు.

బెయిల్ పిటిషన్ పై వాదనల్లో..రవిప్రకాష్.. టీవీ9 అమ్మకం లావాదేవీలపై సంచలనాత్మక ఆరోపణలు చేశారు. అవన్నీ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలో… రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పై… హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఓ రకంగా.. ఇది రవిప్రకాష్ కు గుడ్ న్యూసే. కొత్త చానల్ ప్రయత్నాల్లో రవిప్రకాష్ ఉన్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో… ఇప్పుడు ఆయనకు మరింత వెసులుబాటు లభించినట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close