జగన్ పార్టీకి ” వైఎస్ఆర్” నోటీసులొచ్చాయ్..!

జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని యువజన శ్రామిత రైతు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎలా వాడుకుంటున్నారంటూ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా వాడుకోవడానికి ఎలా చాన్స్ ఉందో చెప్పాలని ఎన్నికల సంఘానికి కూడా.. నోటీసులు పంపింది. కడప జిల్లాకు చెందిన భాషా అనే వ్యక్తి.. అన్న వైఎస్ఆర్ పార్టీ తనదని.. అయితే.. జగన్మోహన్ రెడ్డికి చెందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ… వైఎస్ఆర్ పార్టీ పేరుతో చెలామణి అవుతోందని.. కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో తాను ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశానని.. ఆ పేరు వాడుకోవద్దని… యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చినా… ఆ పని చేయడం… ఆ పార్టీ మానలేదన్నారు.

దీంతో… హైకోర్టు జగన్ పార్టీకి… ఈసీకి నోటీసులు జారీ చేసింది. గతంలో పలుమార్లు చెప్పినా… వైఎస్ఆర్ పేరు వాడుకోవడం మానలేదు కాబట్టి.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని… అన్న వైఎస్ఆర్ పార్టీ నేత భాషా కోరుతున్నారు. విచారణను సెప్టెంబర్ 17కి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ ధిక్కార వ్యాఖ్యలు చేస్తున్నారన్న కారణంగా ఆయనకు విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే లెటర్ హెడ్‌పై ఆ షోకాజ్ ఉంది. దాంతో… తాను ఎన్నికైంది వైఎస్ఆర్ పార్టీ నుంచి కాదని… యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి.. అన్న వైఎస్ఆర్ పార్టీని తెరపైకి తీసుకు వచ్చారు.

అప్పట్నుంచి ఆ పార్టీ నేతలు యాక్టివ్‌గా.. తమ పార్టీ గుర్తింపు కోసం పోరాడుతున్నారు. ఓ పోరాటం.. జగన్ పార్టీ గుర్తింపునకే టెండర్ తెచ్చి పెడుతోంది. ఈ వివాదం వెనుక రఘురామకృష్ణంరాజు ఉన్న ఉన్నారని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. గతంలో తమకు ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలుసుకుని.. ఈ తరహాలో.. ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అందుకే.. ఇటీవలి కాలంలో.. పార్టీపూర్తి పేరుతో ప్రస్తావించడానికి ఆ పార్టీ నేతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో.. పూర్తి పేరు మాత్రమే వాడతామని..వైఎస్ఆర్ పేరు వాడుకోబోమని.. చెప్పే అవకాశం కూడా ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

“చేయూత” డబ్బులతో వ్యాపారం నేర్పిస్తున్న జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం.. మరో వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తాడేపల్లిలోని ఇంటి నుంచి ప్రారంభించారు. ఏడాదికి రూ. 18,750 ఇచ్చే ఈపథకం...

HOT NEWS

[X] Close
[X] Close