ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ” అనంత పద్మనాభుని” బాధ్యతలు..!

దేశంలో అత్యంత ధనిక ఆలయంగా పేరు తెచ్చుకున్న కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం బాధ్యత ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదేనని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అలాగే త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలోనూ కమిటీని కూడా నియమిస్తున్నట్టు తెలిపింది. ఇది, ప్రభుత్వానికి, రాజకుటుంబానికి మధ్యే మార్గంగా ఉంటుందని తీర్పులో పేర్కొంది. నిజానికి ఈ ఆలయం మొదటి నుంచి ట్రావెన్‌కోర్ రాజకుటుంబం నిర్వహణలోనే ఉంది. అయితే.. 2011లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అపార సంపదలు వెలుగుచూశాయి. అంతులేని సంపదతో ఈ ఆలయం వార్తల్లో నిలిచింది. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలు ఐదారు లక్షల కోట్ల విలువ చేస్తాయని అంచనా.

ఈ ఘటన జరిగిన తర్వాత కొంత మంది కేరళ హైకోర్టుకు వెళ్లారు. ఆలయంపై ట్రావెన్‌కోర్ రాజుకుటుంబ పెత్తనం ఏమిటని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ..1991లో ట్రావెన్‌కోర్ రాజ వంశం చివరి పాలకుడు చనిపోవడంతో వారికి అన్ని హక్కులు ముగిసిపోయాయని తీర్పు వెలువరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ రాజ వంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు.. వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అనంతపద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి ఉత్కంఠ రేపుతున్న అంశాల్లో ఒక్క నిర్వహణ అధికారాలే కాదు.. ఆరో నేలమాళిగ తెరవడం కూడా ఉంది. ఆలయంపై పెత్తనం విషయం కోర్టులో ఉండటంతో.. ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అనంత పద్మనాభస్వామి ఆలయంలో మొత్తం ఆరు నేల మాళిగలు ఉన్నాయి. ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. ఆరో గదిని మాత్రం తెరవలేదు. నేలమాళిగ ద్వారానికి నాగబంధం ఉందనీ… ఎలాబడితే అలా తెరిస్తే… ప్రళయం తప్పదని కొందరు వాదించారు. ఆరో గదిలో నిధి నిక్షేపాలు ఉన్నాయనీ… వాటిని కాపాడేందుకే… ఆ గదిగి నాగ బంధం వేశారనీ…చెప్పుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు దైవ నమ్మకాలు, ఇటు సైంటిఫిక్ అంశాల్ని లెక్కలోకి తీసుకొని… ఆరోగదిని తెరిచేదీ లేనిదీ సుప్రీంకోర్టు ట్రావెన్ కోర్ ఫ్యామిలీకే వదిలేసినట్లైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

ట‌బుని ఒప్పించ‌డం సాధ్య‌మా?

కొన్ని క‌థ‌ల్ని రీమేక్ చేయ‌డం చాలా క‌ష్టం. ఆ ఫీల్ ని క్యారీ చేయ‌డం, ఆ మ్యాజిక్‌ని మ‌ళ్లీ రీ క్రియేట్ చేయ‌డం సాధ్యం కాదు. కొన్నిసార్లు.. పాత్ర‌ల‌కు స‌రితూగే న‌టీన‌టుల్ని వెదికి...

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

HOT NEWS

[X] Close
[X] Close