వల్లభనేని వంశీ ఇప్పుడు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. ఆయనపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించడంతో పోలీసులు అరెస్టు చేసే అవకాశం లేదు. అందుకే ఆయన బయటకు వచ్చి ఎప్పట్లాకే కోర్టు వాయిదాలకు, బెయిల్ షరతుల్లో భాగంగా సంతకాలు పెట్టడానికి వెళ్లి రావొచ్చు. మాచవరం పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు కావడంతో వారం రోజులుగా ఆయన తన ముఖ్య అనుచరులతో కలిసి పరారీలో ఉన్నారు.
అరెస్టు చేస్తే బెయిల్ కోసం మళ్లీ నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పోలీసులకు ఆ చాన్స్ ఇవ్వకుండా ఫోన్లు స్విచ్చాఫ్ చేసి వెళ్లిపోయారు. అక్కడ్నుంచే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. నిజానికి ఆయనను పోలీసులు మరోసారి అరెస్టు చేయాలని అనుకోలేదు. నోటీసులు మాత్రమే ఇవ్వాలనుకున్నారు. దానికే ఆయన భయపడి పారిపోయారు.
వల్లభనేని వంశీని ప్రభుత్వం మారగానే అరెస్టు చేయలేదు. వైసీపీలో చేరి ఆయన చేసిన అరాచకాలపై కేసులు పెట్టి విచారణ మాత్రం చేస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి అసలు కేసే ఉపసంహరించుకునే కుట్ర చేయడంతో దొరికిపోయాడు. అప్పట్నుంచి చాలా రోజులు జైల్లో ఉన్నారు. మళ్లీ ఆయనపై కొత్త కేసులు నమోదు కావడంతో పరారయ్యాడు.
