జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరులో తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వైకాపా నేతలు తమ అధినేత దీక్షను అనుమతించమని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు దానిని తిరస్కరించింది. కనుక మరికొద్ది సేపటిలో జగన్ తన నేతలతో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకొనబోతున్నారు. ఒకవేళ జగన్ మొండిగా అక్కడే దీక్షకు కూర్చోవాలని ప్రయత్నిస్తే ఆయన దీక్ష మొదలుపెట్టక ముందే పోలీసులు అరెస్ట్ చేసి భగ్నం చేసే ఆవకాశం ఉంది కనుక మంత్రి పుల్లారావు సూచించిన విధంగా తమ దీక్షను జనసాంద్రత లేని వేరే ప్రాంతానికి తరలించవచ్చు లేదా వాయిదా వేసుకోవచ్చును.