రామోజీ – జగన్‌ భేటి: తెరవెనక కథేంటి?

హైదరాబాద్: వ్యాపారపరంగా, రాజకీయంగా బద్ధశత్రువులైన జగన్మోహన్ రెడ్డి, రామోజీరావు ప్రత్యేకంగా భేటీకావటం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. జగన్ నిన్నసాయంత్రం తమ పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావుతో భేటీ అయ్యారు. భూమన కరుణాకరరెడ్డి తన ఇంట్లో త్వరలో జరగబోయే శుభకార్యానికి రామోజీరావును పిలవటానికి వెళుతూ జగన్‌ అనుమతి కోరారట. దానికి సానుకూలంగా స్పందిస్తూనే ఫిల్మ్ సిటీకి తానుకూడా వస్తానని జగన్ అన్నారట. జగన్ వెంట భూమనతోపాటు విజయసాయిరెడ్డి, రాయలసీమకు చెందిన మరో ఇద్దరు నేతలుకూడా ఉన్నారు. దాదాపు గంటసేపు ఈ భేటీ కొనసాగింది. భేటీ కేవలం వ్యక్తిగతమైనదేనని, శుభకార్యానికి పిలిచేందుకే జగన్, భూమనలు రామోజీని కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సంచలన భేటీపై తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఆకాశమే హద్దుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇవాళ నలుగురు కలిసిన ప్రతిచోటా – హోటళ్ళలో, రైళ్ళలో, బస్సులలో ప్రముఖంగా వినిపిస్తున్న కొన్ని వాదనలు ఇలా ఉన్నాయి –

1. సీబీఐ కేసుల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సంబంధాలను మెరుగుపరుచుకోవటంకోసం జగన్ రామాజీరావును కలిశారు.

2. శనివారంనుంచి గుంటూరులో ఏపీకి ప్రత్యేకహోదాకోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టబోతున్నందున రామోజీరావు మద్దతు తీసుకోవటంకోసం జగన్ కలిశారు.

3. చంద్రబాబు నాయుడుకు, రామోజీరావుకు బేధాభిప్రాయాలు వచ్చినందును రామోజీ ఇప్పుడు జగన్‌ను దువ్వుతున్నారు.

4. రామోజీ, జగన్ కలిసి చంద్రబాబు నాయుడును దించటానికి వ్యూహాలు పన్నుతున్నారు.

5. ఈనాడు-సాక్షి సంస్థలలో ఉద్యోగులకు బచావత్ కమిటీ సిఫార్సుమేరకు వేతనాలు పెంచేవిషయంలో రామోజీ, జగన్ ఒక్కటయ్యారు. నేను పెంచను-నువ్వూ పెంచొద్దు అని అవగాహనకు వచ్చారు.(ఇది ఆ సంస్థలలోని ఉద్యోగుల వాదన)

6. తెలంగాణ వచ్చాక రామోజీ ఫిల్మ్ సిటీని నాగళ్ళతో దున్నిస్తానని ఒకప్పుడు వ్యాఖ్యానించిన కేసీఆర్‌తో రామోజీ రాజీ పడ్డారు. కేసీఆర్‌కు జగన్ మిత్రుడు కాబట్టి జగన్‌తో కూడా రాజీ పడిపోయారు.

7. ఈ భేటీ తర్వాత చంద్రబాబునాయుడుకు రామోజీరావుతో విభేదాలు ఏర్పడతాయి. రామోజీరావు తెలుగుదేశం ఆగ్రహాన్ని మూటగట్టుకుంటారు.

8. జగన్ రామోజీరావు దగ్గరకు వెళ్ళటం దిగజారటమే. అతని పతనం ప్రారంభమయింది.(వైసీపీలోని ఒకవర్గం వాదన)

9. జగన్‌ను కేసీఆరే రామోజీ దగ్గరకు పంపారు. వారిద్దరినీ కలపటంద్వారా చంద్రబాబును దెబ్బతీయాలని కేసీఆర్ ప్లాన్.

10. రామోజీరావు కుమారుడు సుమన్ చనిపోయినందున ఓదార్చటానికి జగన్ వెళ్ళారు.

ఈ వాదనలు ఎలా ఉన్నా, వాస్తవానికి వైఎస్, ఆయన వర్గం మొదటినుంచి ఈనాడు పేరు చెబితేనే నిప్పులు చెరుగుతుండేవారు. ‘సాక్షి’ మీడియాలో ఈనాడుపై, రామోజీరావుపై ఎన్ని ద్వేషపూరిత కథనాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. వివిధ వ్యాపారాలలో రామోజీరావుతో విభేదించి బయటకొచ్చిన ఆయన బంధువులతో ఇంటర్వ్యూలు చేసి ఆయనను దుర్మార్గుడిగా, నీచుడిగా – చివరికి దేశద్రోహిగా కూడా చిత్రీకరిస్తూ ‘సాక్షి’లో అనేక కథనాలు వెలువరించారు. తండ్రితో విభేదించి బయటకొచ్చేసిన రామోజీరావు కుమారుడు సుమన్‌‌తో ప్రత్యేక ఇంటర్వ్యూను ప్రచురించారు. అలాగే జగన్ భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని, సెజ్‌లలో అక్రమంగా భూ కేటాయింపులు జరిగాయని ‘ఈనాడు’ లెక్కకు మించిన కథనాలు వెలువరించింది. ఒక సమయంలో రెండు పత్రికలూ ఒకదానిపై మరొకటి తీవ్రస్థాయిలో విషం చల్లుకున్నాయి. అంతటి శత్రుత్వమున్న వీరు ఇప్పుడు కలవటం ఖచ్చితంగా చర్చనీయాంశమే.

ఇటీవల రామాజీ రావు, జగన్ ఒకట్రెండు శుభకార్యాలలో ఎదురుపడటం జరిగింది. మోహన్ బాబు కుమారుడు మనోజ్ పెళ్ళిలోకూడా అలాగే ఎదురుపడటం, టి.సుబ్బరామిరెడ్డి వీరిద్దరికీ మధ్యలో అనుసంధానం చేయటం, ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకోవటం టీవీ ఛానల్స్‌లో అందరూ చూశారు. ఆ సందర్భంగా – ప్రతిపక్షనాయకుడిగా బాగా చేస్తున్నారని, బాగా తిరుగుతున్నారని రామోజీ జగన్‌ను మెచ్చుకున్నట్లు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇద్దరిమధ్యా పరిచయం పెరిగి ఉంటుంది. ఫిల్మ్ సిటీకి ఒకసారి రావాలని రామోజీరావు ఆహ్వానించి ఉండొచ్చు. ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి జగన్ వెళ్ళి ఉండొచ్చు. అంతకుమించి ఈ భేటీలో ప్రత్యేక రాజకీయ కారణాలు ఉండే అవకాశం లేదు.

తెలుగుదేశంపార్టీకూడా ఈ భేటీని ఇంతకుమించి సీరియస్‌గా తీసుకుంటుందని భావించలేము. ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పుతున్న ఇద్దరు కీలక వ్యక్తులు – కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎమ్ రమేష్‌లకుకూడా జగన్‌తో మంచి అనుబంధం ఉంది. ఆ విషయాన్ని వారు బహిరంగంగాకూడా వివిధ సందర్భాలలో చెప్పారు. ఇటీవల మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు షష్టిపూర్తి వేడుకల్లో సుజనా చౌదరి జగన్‌తో సన్నిహతంగా మెలగటం లైవ్‌లో స్పష్టంగా కనబడింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయంలోమాత్రం జగన్‌ను మెచ్చుకోవాలి. ఎంతో వైయుక్తికం(highly individualistic)గా ఉండే జగన్, పెద్దరికానికి గౌరవం ఇచ్చి రామోజీరావుదగ్గరకు వెళ్ళి కలవటం అభినందనీయం. ఇది అతనిలో పరిణతిని చూపుతోందనే వాదన వినబడుతోంది.

అయితే ఈ భేటీవలన వైసీపీకి డేమేజ్ జరుగుతుందన్న వాదనకూడా వినిపిస్తోంది. ఇంతవరకు టీడీపీకి రాజగురువుగా పరిగణిస్తూ వస్తున్న రామోజీతో ఇప్పుడు జగన్ భేటీ అవటం వలన క్షేత్రస్థాయిలో టీడీపీతో పోరాడుతుండే వైసీపీ కార్యకర్తలు అవమానంగా భావిస్తారని అంటున్నారు. మరి ఈ భేటీని జగన్ ఎలా సమర్థించుకుంటారో వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close