ఓంకార్ రేంజ్ స్టంట్స్…అది కూడా రియల్‌గా…రేటింగ్స్ ఎందుకు రావు?

టెలివిజన్ ఇండస్ట్రీలో ఓంకార్ ఒక సంచలనం. సంచలనాన్ని బాగా ఉపయోగించుకుని ఆయన ప్రోగ్రామ్స్‌కి సంచలన స్థాయి రేటింగ్స్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత్తర్వాత ఓంకార్ స్టంట్స్ అని డ్రామా అని తెలుసుకున్న ప్రేక్షకులు దెబ్బకు రేటింగ్స్ డౌన్ అయిన విషయం కూడా వాస్తవం అనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్‌కి కూడా సూపర్ రేటింగ్స్ వస్తున్నాయి. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలకు జరుగుతూ ఉంటే….ప్రజా సమస్యలను పరిష్కరించేదిశగా సాగుతుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు, ప్రజలు చాలా చాలా గర్వపడాల్సిన విషయం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది ఏంటి? ఓంకార్ అలవాటు చేసిన డ్రమటిక్ గొడవలు, ఛాలెంజ్‌లు విసురుకోవడాలు, తిట్టుకోవడాలు….అబ్బో ఆట ప్రోగ్రాములో ఉన్నంత డ్రామాని మించి ఉంటుంది అసెంబ్లీలో డ్రామా.

దాదాపుగా వంద నుంచి నూటా యాభై మంది పార్టిసిపెంట్స్ ప్రతి రోజూ హాజరవుతూ ఉంటారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టక ముందు వరకూ వాళ్ళలో చాలా మంది కాస్త స్నేహంగానే ఉంటారు. కానీ ఒక్కసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత ….కెమేరా రోల్ అవుతోంది…లైవ్ టెలికాస్ట్ అవుతోంది అని తెలిసిన తర్వాత మాత్రం టివి ప్రోగ్రామ్స్, సీరియల్స్, సినిమాలలో నటించే ఆర్టిస్ట్స్‌కి లేనంత ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు బయటకు వస్తారు. వాళ్ళలో కొంతమంది డ్రామాను రక్తికట్టించడం కోసమే ఉంటారు. మాటలు తక్కువ….బూతులు ఎక్కువ అన్నట్టుంటుంది వ్యవహారం. ఈ విషయంలో మహిళలు కూడా ఏమీ తక్కువ కాదు. సీరియల్స్‌ యాక్టర్స్‌కి అయినా వెంటనే ఏడుపు తెచ్చుకోవడం కష్టమేమో కానీ ఇక్కడ ఆర్టిస్టులకు మాత్రం వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. ఇష్యూని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అన్న పార్టీ డెసిషన్‌ని బట్టి ఆ ఏడుపు స్థాయి ఉంటుంది. మరోవైపు అమ్మాయిలు రోడ్లపైన నడుచుకుంటూ వెళ్తుంటే ….వాళ్ళకు వినిపించీ వినపించకుండా టీజ్ చేస్తూ రన్నింగ్ కామెంట్రీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి బాపతు జనాలకు కూడా అసెంబ్లీలో కొదువ లేదు. ఇక ఛాలెంజ్‌ల పర్వం అయితే భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆ స్థాయి డ్రామాని మనం రాజమౌళి సినిమాలలో కూడా చూడలేం. ఇక ఈ మొత్తం డ్రామాని రసవత్తరంగా నడిపించడంలో స్పీకర్ రోల్ అంతా ఇంతా కాదు. అంపైర్ రివ్యూ డెసిషన్ పద్ధతిని ఎఫెక్టివ్‌గా వాడుకోవడం కోసం ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పెవిలియన్ వైపు చూసినట్టుగా….మన స్పీకర్ సర్ కూడా కొంతమంది కనుసైగల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. డ్రామా రక్తికట్టించడం కోసం ఆయన పార్ట్‌ని ఆయన కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటాడు. ఈ డ్రామాని రక్తికట్టించడంలో అధికార బలం, సంఖ్యాబలం ఉన్న అధికార పార్టీదే అధిక పాత్ర అనడంలో సందేహం లేదు.

ఇంతటి డ్రామాలో అసలు విషయమైన ప్రజా సమస్యలను చర్చించడం, ఆ సమస్యల పరిష్కారం కోసం విధానాలు రూపొందించడం అన్న అసలు పనికి మాత్రం అసలు చోటే లేదు. ఆ ఉద్ధేశ్యం ఉన్నట్టుగా కూడా అస్సలు కనిపించదు. కానీ ఆ ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉన్నాం, మా పాట్లన్నీఅందుకోసమే అని చెప్పి డ్రామాలు మాత్రం ఆడుతూ ఉంటారు. ఆ డ్రామాల వెనుక అసలు నిజాలను బయటపెడుతున్న సోషల్ మీడియాను, ప్రజల తరపున ప్రశ్నిస్తున్న మీడియాను నిషేధించడం ఎలా అనే విషయంపైన మాత్రం చర్చల మీద చర్చలు నడుపుతారు. ఇక చివరగా ఇలాంటి డ్రామాలను ప్రోత్సహిస్తున్న భజన మీడియా డ్రామా గురించి చెప్పాలంటే ఈ స్పేస్ సరిపోదు. మరి ఆట, జబర్ధస్త్‌లాంటి ప్రోగ్రామ్స్, సీరియల్స్, సినిమాలలో ఉండే డ్రామా కంటే ఎక్కువ డ్రామా, అంతకంటే ఎక్కువగా రసవత్తరంగా నడుస్తున్నప్పుడు రేటింగ్స్ రాకుండా ఎక్కడికి పోతాయి? ఇంతకు ముందు ఎప్పుడూ చూడనంత స్థాయి డ్రామా ఇప్పుడు నడుస్తోంది కాబట్టి రేటింగ్స్ కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. ఎనీ డౌట్స్?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close