ఆకాశహర్మ్యాలు ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హాట్ ప్రాపర్టీలుగా మారుతున్నాయి. నెల్లూరులో 30 అంతస్తుల అపార్టుమెంట్ సిద్ధమవుతోంది. నారాయణ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో లగ్జరీ రెసిడెన్షియల్ హై-రైజ్ టవర్ నిర్మాణం అవుతోంది. నెల్లూరులో మొదటి 30 అంతస్థుల రెసిడెన్షియల్ టవర్ లో 90 ఫ్లాట్లు ఉంటాయి. ఆధునిక డిజైన్‌తో కూడిన లగ్జరీ అపార్ట్మెంట్లు, హైదరాబాద్ , బెంగళూరు వంటి మెట్రో నగరాల స్థాయిలో జీవనశైలిని అందించేలా నిర్మిస్తున్నారు.
ఇదే కాదు ఇంకా పలు చోట్ల భారీ అపార్టుమెంట్లు నిర్మాణంలోనే ఉన్నాయి. హరినాథపురంలోనే మరో G+23 అంతస్థుల రెసిడెన్షియల్ టవర్ నిర్మాణంలో ఉంది. ఇది కూడా లగ్జరీ అపార్ట్మెంట్లను అందిస్తుంది. అదే ప్రాంతంలో ఒక 5-స్టార్ హోటల్ నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ నెల్లూరు రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లభిస్తూండటంతో ఇతర బిల్డర్లు కూడా.. ప్రాజెక్టులను పట్టాలెక్కించే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టుల్లో ధరలు అందుబాటులోనే ఉంటున్నాయని చెబుతున్నారు. నెల్లూరులో లగ్జరీ అపార్ట్మెంట్ల ధరలు సాధారణంగా రూ. 50 లక్షల నుండి కోటిన్నర వరకూ చెబుతున్నారు. సైజును బట్టి.. ధరలు పెరుగుతున్నాయి. నెల్లూరులో హరినాథపురం ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ఈ ప్రాజెక్ట్ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించవచ్చుని అంచనా వేస్తున్నారు.