రివ్యూ : హైవే (ఆహా ఒరిజినల్ )

Highway Movie review

ఆహా ఈమ‌ధ్య‌ ఒరిజినల్ కంటెంట్ పై ద్రుష్టి పెట్టింది. స్వయంగా వెబ్ సిరీస్‌లు, సినిమాలూ నిర్మిస్తోంది. తాజాగా ఆహా నుంచి ఓ సైకో థ్రిల్లర్ వచ్చింది. అదే.. హైవే. ఆనంద్ దేవరకొండ, సయామీ ఖేర్ లాంటి స్టార్ కాస్ట్ వుంది. అలాగే పాతాల్ లోక్ సిరిస్ తో ఆకట్టుకున్న అభిషేక్ బెనర్జీ కూడా వున్నాడు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా అపార‌మైన అనుభ‌వం ఉన్న‌.. కెవి గుహ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 118 లాంటి మంచి సినిమా ఆయ‌న్నుంచే వ‌చ్చింది. కాబ‌ట్టి… ఈ సినిమాపై కాస్త దృష్టి పెట్టొచ్చ‌నిపించింది. మ‌రి… గుహ‌న్ ఈ సైకో క‌థ‌ని ఎలా తీశాడు? ఏమైనా థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయా?

డీ అలియాస్ దాస్ (అభిషేక్ బెనర్జీ) ఓ సైకో కిల్లర్. ఒంటరిగా కనిపించిన‌ అమ్మాయిల్ని అంబులెన్స్ లో నిర్మాన్యుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అతి క్రూరంగా చంపేస్తుంటాడు. సైకో కిల్లర్ వరస హత్యలు నగరంలో కలకలం రేపుతాయి. ఏసీపీ ( సయామీ ఖేర్) సైకో కిల్లర్ పట్టుకునేందుకు రంగంలో దిగుతుంది. విష్ణు (ఆనంద్ దేవరకొండ) స్టిల్ ఫోటోగ్రఫర్. స్నేహితుడు స‌ముద్రం (సత్య)తో కలసి ఒక ఈవెంట్ కోసం హైవేలో ప్రయాణం మొదలుపెడతాడు. తులసి( మానస రాధాకృష్ణన్) అమాయకురాలు. తన తండ్రిని కలవడం కోసం ఒంటరిగా మంగుళూరు ప్రయాణమౌతుంది. ఈ ప్రయాణంలో విష్ణు ని కలుస్తుంది. విష్ణు , తులసిని మంగళూరు కి దగ్గర వున్న ఒక బస్ స్టాప్ లో దించి వెళ్ళిపోతాడు. ఐతే అదే సమయానికి తులసి ఎక్కిన బస్ బ్రేక్ డౌన్ అవుతుంది. రాత్రిపూట బస్ స్టాప్ లో వంటరిగా మిలిగిపోయిన తులసి సైకో చేతికి చిక్కుతుంది. తర్వాత ఏం జరిగింది ? తులసిని విష్ణు రక్షించాడా ? సైకోని పట్టుకునే క్రమంలో పోలీసులు ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నారు ? అనేది మిగతా కథ.

సైకో కిల్లర్ చిత్రాలకు కి ఒక టెంప్లెట్ ఉంటుంది. ఒక సైకో… తన సైకో సాటిస్ఫెక్షన్ కోసం ఒకే మోడల్ లో హ‌త్య‌లు చేస్తుంటాడు. తనని పట్టుకోవాలని చూసే వారికి సవాళ్ళు విసురుతుంటాడు. చివరికి పట్టుబడతాడు. దాదాపు ఇదే టెంప్లెట్. హైవే కూడా ఇదే తీరులో సాగుతుంది. అయితే ఇక్కడున్న వెరైటీ ఏమిటంటే.. మొదటి హత్య నుంచే సైకో ఎవ‌రో చెప్పేశాడు ద‌ర్శ‌కుడు. అసలు సైకో ఎవరో రివిల్ చేయడమే ఇలాంటి సినిమాల్లో కిక్ ఇచ్చే పాయింట్. ఇందులో మాత్రం ఎలాంటి మలుపులు లేకుండానే సైకోని రివిల్ చేశారు. దాంతో.. అస‌లు ట్విస్టు ఇంకేదో ఉంద‌న్న భ్ర‌మ క‌ల్పిస్తాడు. అయితే చివ‌రి వ‌ర‌కూ అది కేవ‌లం భ్ర‌మ‌గానే మిగిలిపోతుంది. సైకో చేసే మొదటి రెండు హత్యలు భీభ‌త్సంగా వుంటాయి. తులసి పాత్రని పరిచయం చేసే విషయంలో దర్శకుడి ఎత్తుగడ కొంత వరకు ఫలించింది. పాపం ఇంత అమాయకురాలు సైకో బారిన పడితే పరిస్థితి ఏమిటనే ఎమోషన్ ని రాబట్టుకున్నాడు.

ఇలాంటి కథల్లో ప్రేమ వ్య‌వ‌హారాలు చొప్పించడం కష్టం. అయితే తులసి, విష్ణు పాత్రల మధ్య ఒక మంచి బాండింగ్ ని నడపడటానికి ఒక పాటని క్రియేట్ చేశాడు. అయితే అది కూడా అనవసరం అనిపిస్తుంది. తులసి సైకో కి దొరికిన తర్వాత థ్రిల్ మరోస్థాయిలో వుండాలి. కానీ ఈ విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు. తులసి కోసం వెదికే క్రమంలో అందరూ రోడ్లు పట్టుకొని అయోమయంగా తిరగడం తప్పితే అటు సైకో గానీ ఇటు పోలీసులు గానీ ఎలాంటి మైండ్ గేమ్ నడపరు. ఈ క్రమంలో డ్రామా కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. నిజానికి పోలీసులకు సైకో దొరికినప్పుడే ఈ కథ అయిపొయింది. కానీ సైకో హీరోకే దొరకాలనే ఆలోచనతో ఇంకాస్త లాగారు. ఈ క్రమంలో వచ్చిన ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం మెలో డ్రామాలోకి వెళ్ళినట్లనిపిస్తది. సడన్ గా పులి ప్రత్యక్షమౌతుంది. దీనికి దర్శకుడు ఇచ్చుకున్న సబ్ టెక్స్ట్ ఏమిటంటే.. తులసి తల్లి.. ‘మనకి దుర్గమ్మే అండ’ అని చెబుతుంది. (దుర్గమ్మ వాహనం పులి) ఒక మృగాన్ని మరో మృగం చంప‌డ‌మే ప్ర‌కృతి ధ‌ర్మ‌మా? అంటూ ఓ క‌న్‌క్లూజ‌న్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అలా పులిని క్లైమాక్స్ లోకి తీసుకురావడం అదొక వెరైటీ అనుకోవాలి.

ఆనంద్ దేవర కొండ కామన్ కుర్రాడిలా కనిపించాడు. అయితే ఆ పాత్రకి పెద్ద స్కోప్ లేదు. మానస రాధాకృష్ణన్ క్యూట్ గా వుంది. సహజంగా కనిపించింది. అభిషేక్ బెనర్జీ చూడగానే సైకోలా అనిపిస్తాడు. సైకిక్ పాత్రకు సరిపోయాడు. సయామీ ఖేర్ ఓకే. సత్య పాత్ర చిన్నదే. ఆ పాత్ర నుంచి ఫ‌న్ రాబ‌ట్టుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. జాన్ విజయ్ రెండు సీన్స్ లో కనిపించినా మెప్పిస్తాడు. సురేఖ వాణితో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

ప‌రిమిత‌ బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. తెరపై ఆ పరిమితులు కనిపిస్తుంటాయి. మొత్తం అవుట్ డోర్ లో షూట్ చేశారు. దాదాపు హైవేలోనే సినిమా పూర్తవుతుంది. పాట షూట్ చేసిన విధానంలో గుహన్ పనితనం కనిపిస్తుంది. నేపధ్య సంగీతం ఓకే. ఓటీటీ కథ చేసిన్నపుడు అవుట్ అఫ్ ది బాక్స్ వెళ్ళే అవకాశం వుంది. కంటెంట్ విస్తృతి పెరిగిన ఈ రోజుల్లో అది అవసరం కూడా. అయితే దర్శకుడు గుహన్ మాత్రం రొటీన్ టెంప్లెట్ తోనే హైవే ప్రయాణం చేయడానికి మొగ్గు చూపడం కొంత నిరాశని కలిగిస్తుంది.

ఫినిషింగ్ ట‌చ్‌: ‘నో’ వే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close