హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని హిమాన్షు ఖండించినట్లుగా సోషల్ మీడియాలోపోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. తనకు ఎలా దెబ్బలు తగిలాయో చెప్పలేదు కానీ.. జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమేనని తాను నడవగలిగే పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఆయన సోషల్ మీడియా పోస్టింగ్ కనిపించింది.

మామూలుగా అయితే ఈ విషయాన్ని అందరూ లైట్ తీసుకునేవారు. కానీ కేసీఆర్ ఫ్యామిలీలో హిమాన్షు ప్రత్యేకం. సీఎం కేసీఆర్ కు హిమాన్షు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పనులైనా హిమాన్షును పక్కన పెట్టుకునే చేస్తారు. శంకుస్థాపనలు కూడా హిమాన్షుతో చేయించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే..హిమాన్షుకు గాయాలనే సరికి సోషల్ మీడియా కూడా సూపర్ యాక్టివ్‌గా మారిపోయింది. అదీ కూడా హార్స్ రైడింగ్ చేస్తూ ప్రమాదం అనే సరికి రకరకాల కోణాల్లో విశ్లేషించడం ప్రారంభించారు.

ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ప్రస్తుతానికి హిమాన్షుకు యశోదా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. రాజకీయ ఫ్యామిలీలో భవిష్యత్ ఉన్న చిన్నారిగా ఉన్న హిమాన్షు.. తను కింద పడిన విషయాన్ని అచ్చంగా రాజకీయ నేతలాగే కవర్ చేసుకున్నారని.. టీఆర్ఎస్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆరు రోజుల తర్వాత ఏరియల్ సర్వే..! తీవ్రత కనిపిస్తుందా..?

వరద వచ్చి ఆరు రోజులు అయింది. ఇప్పుడు బురద మాత్రమే మిగిలింది. వరద వచ్చినప్పుడు సైలెంట్ గా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ..ఆరు రోజుల తర్వాత ఏరియల్ సర్వే...

ఒత్తిడికి త‌లొంచిన విజ‌య్‌సేతుప‌తి

`800` సినిమా మొద‌లవ్వ‌క ముందే... అనేక వివాదాల్లో, విమ‌ర్శ‌ల్లో చిక్కుకుంది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత క్రికెట్ ఆట‌గాడు ముత్త‌య్య ముర‌ళీధ‌రన్ బ‌యోపిక్ ఇది. ఆ పాత్ర‌లో విజ‌య్‌సేతుప‌తి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఫ‌స్ట్...

దుబ్బాకలో ప్రచారానికి పవన్ కల్యాణ్..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ కన్నా.. బీజేపీ గురించే ఎక్కువ ట్వీట్లు.. ప్రకటనలు చేస్తున్న ఆయనను గరిష్టంగా ఉపయోగించుకోవాలని బీజేపీ...

నిరసనల సెగ…! హైదరాబాద్ వరద బాధితులకు రూ. 550 కోట్లు ఇస్తున్న కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరదలకు నష్టపోయిన హైదరాబాద్ వాసుల్ని ఆదుకోవడానికి కార్యాచణ ప్రణాళిక ప్రకటించారు. హైదరాబాద్‌లో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10 వేల సాయం అందించాలని నిర్ణయించారు. మంగళవారం ఉదయం...

HOT NEWS

[X] Close
[X] Close