రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో…. ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు కారణంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల్ని కాపాడేందుకా అన్నట్లుగా చనిపోయిన ఆ బాధితురాలికి అర్థరాత్రి అంత్యక్రియలు చేయడం ఒకటి అయితే..ఆమెపై అసలు అత్యాచారమే జరగలేదని పోలీసులు… తేల్చడం మరో కారణం. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంకా గంధీ ప్రత్యేకంగా టేకప్ చేశారు. రెండు రోజుల నుంచి వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. గురువారం.. వారు స్వయంగా హత్రాస్ వెళ్లాలనుకున్నారు.

అయితే అనూహ్యంగా పోలీసులు అడ్డుకున్నారు. యమునా ఎక్స్‌ప్రెస్ హైవే పై వాహనాలను నిలిపివేయడంతో రాహుల్, ప్రియాంక కాలి నడకన బయలుదేరారు. కానీ పోలీసులు నడుచుకుంటూ కూడా పోనివ్వలేదు. ఓ దశలో ఆయనను అడ్డుకోవడానికి పోలీసులు తోపులాటకు దిగారు. రాహుల్ గాంధీ చొక్కా పట్టుకుని లాగేశారు. దాంతో ఆయన కింద పడిపోయారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలపై అధికారపార్టీలు చూపిస్తున్న అణిచివేత ధోరణికి ఇదే సాక్ష్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు కనీసం..ఏదైనా ఘటన జరిపినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి.

ప్రతిపక్ష నేతలు రాజకీయ పర్యటనలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ..అధికారం బలంతో పోలీసుల్ని ఉపయోగించి వెనక్కి పంపేస్తున్నారు. అధికారపార్టీ కార్యకర్తలు ఏం చేసినా సైలెంట్‌గా ఉండి విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఢిల్లీకి కూడా పాకింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న విమర్శలు అంతకంతకూ పెరగడానికి ఇలాంటి ఘటనలు కారణం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

HOT NEWS

[X] Close
[X] Close