హిర‌ణ్య క‌శ్య‌ప‌.. మ‌రింత మంది స్టార్లు

గ‌తేడాదిగా `హిర‌ణ్య క‌శ్య‌ప‌` అనే సినిమా గురించి వార్త‌లు వస్తూనే ఉన్నాయి. ఈమ‌ధ్యే గుణ‌శేఖ‌ర్ కూడా `మా సినిమా త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది` అంటూ ఓ ప్ర‌క‌ట‌న కూడా చేశాడు. అయితే.. ఈ సినిమాకి బడ్జెట్ స‌మ‌స్యే ప్ర‌ధానంగా ఆడ్డొస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల‌తో తెర‌కెక్కించ‌డానికి రెడీ అయ్యింది. సురేష్ బాబు ఓ సినిమా కోసం ఈ స్థాయిలో ఖ‌ర్చు పెట్ట‌డం ఇదే తొలిసారి. రానాకి ఎలాగూ బాలీవుడ్‌లో మార్కెట్ ఉంది కాబ‌ట్టి, ధైర్యం చేసి – వంద కోట్లు పెట్టడానికి రెడీ అయ్యాడు. అయితే గుణ‌శేఖ‌ర్ మాత్రం బ‌డ్జెట్‌ని పెంచుకుంటూ వెళ్లాడు. ఇప్పుడు ఈ సినిమా బ‌డ్జెట్ రూ.200 కోట్లుగా తేలింది. మ‌రీ 200 కోట్ల‌యితే నేను సినిమా తీయ‌లేను అని సురేష్ బాబు చేతులు ఎత్తేశాడు. దాంతో… ట్వంటీయ‌త్ ఫాక్స్ సెంచ‌రీ సంస్థ‌తో గుణ చేతులు క‌లిపాడు. వాళ్ల సాంకేతిక స‌హ‌కారం తీసుకుని, వాళ్ల‌నీ నిర్మాణంలో భాగ‌స్వాముల్ని చేశాడు. అయినా స‌రే – సురేష్ బాబు ధైర్యం చేయ‌డం లేద‌ని స‌మాచారం. దాంతో ఇప్పుడు గుణ శేఖ‌ర్ కూడా పెట్టుబ‌డి పెట్ట‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌. అంత‌ర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని వాడ‌క‌పోతే… ఈసినిమాలో క్వాలిటీ రాదని, అందుకోసం రూ.200 కోట్లు ఖర్చు పెట్ట‌క త‌ప్ప‌ద‌ని గుణ చెబుతున్నాడు. రానాపై అంత తిరిగొస్తుందా? అనేది సురేష్ బాబు భ‌యం. అందుకే.. ఈ సినిమాలో మ‌రింత‌మంది స్టార్ల‌ని తీసుకోవాల‌ని భావిస్తున్నాడు గుణ‌. బాలీవుడ్ నుంచి కొంద‌రిని, త‌మిళం నుంచి మ‌రికొంద‌రినీ రంగంలోకి దింప‌బోతున్నాడు. ఈ సినిమాలో మ‌రో తెలుగు క‌థానాయ‌కుడూ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. వాళ్ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తే గానీ – 200 కోట్లు రిస్కా? కాదా? అనేది తెలీదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close