హితుడు చిత్రాన్ని అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత కేఎస్వీ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ మొదటి వారం లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కొత్త దర్శకుడు విప్లవ్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే ఈ చిత్రంలో జగపతి బాబు హీరో గా మూడు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారని నటనలో అనేక చ్చాయలు ప్రదర్శిం చారని ప్రకటనలో పేర్కొనారు. జగపతి బాబు తో బాటు ప్రధాన భూమిక లో మళయాళ నటి మీరా నందన్ నటించారు. బెనర్జీ సీ వీ ఎల్ ఇతర పాత్రల్లో సహకరించారు
అరకు లో ఎక్కువ భాగం చిత్రీకరించిన ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను వైజాగ్ హైదరాబాద్ లలో వివధ లొకేషన్ లలో పూర్థి చేశారు.చిత్రం లోని అయిదు పాటలు అనంత శ్రీ రామ్ రచించగా కోటి సంగీతం ఆందించారు. భరణి కె ధరన్ చాయాగ్రహణం అందించగా ధర్మేంద్ర కాకరాల ఎడిట్ చేశారు త్వరలో ఆదియో విడుదల జరుగుతుందని నిర్మాత కేఎస్వీ తెలిపారు. ప్రముఖ నిర్మాత మధు మురళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు