హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హాట్ ప్రాపర్టీగా ఉన్న ప్రాంతం బుద్వేల్. అక్కడ హెచ్ఎండీఏ ఓ భారీ లేఔట్లు రెడీ చేసింది. త్వరలో వేలం వేయనుంది. ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున హెచ్ఎండీఏ ఆమోదంతో లే ఓట్లు వేశారు. అక్కడ స్థలం కొంటే రిటర్న్స్ బాగా ఉంటాయన్న అభిప్రాయం ఉండటంతో డిమాండ్ పెరుగుతోంది.
బుద్వేల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదం పొందిన లేఅవుట్లలో ప్లాట్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. బుద్వేల్ రాజేంద్రనగర్ సమీపంలో .. ఔటర్ రింగ్ రోడ్ (ORR), శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉంది.
2023 ఆగస్టులో HMDA ఆమోదం పొందిన లేఅవుట్లలో 100 ఎకరాలను 14 ఓపెన్ ప్లాట్లుగా విభజించి వేలం వేశారు. ఒక్కో ఎకరం సగటున రూ.40 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది చదరపు గజం ధరగా లెక్కిస్తే సుమారు 70, 000 రూపాయలపైనే అవుతుంది
కానీ ఇప్పుడు ఇతర బిల్డర్లు వేసిన లేఔట్లలో అంత ధర లేదు. HMDA ఆమోదం పొందిన లేఅవుట్లలో చాలా చోట్ల పాతిక వేలకు కూడా చదరపు గజం లభిస్తోంది. 150-200 స్క్వేర్ యార్డ్స్ చదరపు గజం పాతిక వేల లోపు కూడా లభిస్తున్నాయి. పెద్ద ప్లాట్లు, ప్రైమ్ లొకేషన్లో ఉన్నవి కాస్త ఎక్కువ ధర పలుకుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇళ్లు కట్టుకునే ఫ్లాట్లు అయితే.. కాస్త ఎక్కువ ధర పలుకుతున్నాయి.
హెచ్ఎండీఏ త్వరలో ప్లాట్లు వేలం వేయనుంది. పూర్తి స్థాయిలో క్లియర్ టైటిల్, పూర్తి సౌకర్యాలు ఉండే ప్లాట్లు కావడంతో కనీసం యాభై వేల రూపాయల ధర పలికే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.