హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న తమ భూముల్ని భారీ ధరకు అమ్మేందుకు హెచ్ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. బాచుపల్లి , తుర్కయాంజల్‌లో ప్లాట్ల వేలానికికనీస స్పందన రాలేదు. బాచుపల్లిలో 70 ప్లాట్లు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు, తుర్కయాంజల్‌లోని 12 ప్లాట్లలో కేవలం 2 మాత్రమే వేలంలో దక్కించుకున్నారు.
మెడ్చల్-మల్కజిరి జిల్లాలో ని బాచుపల్లిలో 70 ప్లాట్లు వేలంలో పెట్టారు. గజం ధర రూ. 70,000 కనీస ధరగా నిర్ణయించారు. వేలంలో ఒక్కరు కూడా కొనలేదు. అక్కడ బహిరంగ మార్కెట్లో ధర గజానికి రూ. 40,000-50,000 మధ్య మాత్రమే ఉంది. అందుకే 70వేల కనీస ధర పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్‌లో 12 ప్లాట్లు. గజం రూ. 65,000 అప్సెట్ ప్రైస్ గా నిర్ణయించి వేలం వేశారు. అక్కడ మార్కెట్ రేట్ రూ. 45,000-50,000 మధ్య ఉండటంతో, కేవలం 2 ప్లాట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కేవలం ఇద్దరు బిడ్డర్లు మాత్రమే పాల్గొన్నారు.
ఈ ఆక్షన్ ద్వారా HMDA రూ. 500 కోట్లు సంపాదించాలని ఆశించింది, కానీ దాదాపు జీరో రెవెన్యూ. మొత్తం 93 ప్లాట్లలో బాచుపల్లి 70, తుర్కయాంజల్ 12, మిగతా 11 వివిధ ప్రాంతాల్లో కేవలం 3 అమ్ముడయ్యాయి. ప్రీ-బిడ్ మీటింగ్‌లో కూడా పాల్గొన్నవారు చాలా తక్కువ. నిధుల కోసం హెచ్ఎండీఏ అత్యాశకు పోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. అప్సెట్ ప్రైస్ మార్కెట్ రేట్ కంటే 30-50% ఎక్కువ పెట్టారు. కొన్ని ప్లాట్లలో అప్రోచ్ రోడ్లు లేకపోవడం సహా చాలా సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారానికి గ్యారంటీ లేదు. అందుకే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు.