దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భారతీయులకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది. ట్యాక్స్-ఫ్రీ రెంటల్ ఇన్కమ , గోల్డెన్ వీసా , డెవలపర్ పేమెంట్ ప్లాన్లతో దుబాయ్‌లో భారతీయుల ఇళ్లు కొనుగోళ్లు పెరుగుతున్నాయి. 2024లో రూ. 84,000 కోట్లు దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలు కోసం ఇన్వెస్ట్ చేశారు.
దుబాయ్‌లో ఇళ్లు కొనుగోళ్లకు UAE బ్యాంకులు మార్ట్గేజ్ ఆఫర్ చేస్తాయి. ఇందు కోసం భారత్ లో ఆదాయం ఉంటే చాలు. ఉద్యోగం చేస్తూ ఉంటే శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్లు, ట్యాక్స్ రిటర్న్స్ చూపిస్తే రుణం ఇస్తారు. UAEలో రెసిడెంట్ అయితే మాత్రమే ఇస్తారు. ఇండియాలోనే నివసరించే వారికి UAE బ్యాంకులు డైరెక్ట్‌గా లోన్ ఇవ్వవు – RBI అనుమతి అవసరం. బదులుగా, ఇండియన్ బ్యాంకులు దుబాయ్ ప్రాపర్టీకి NRI హోమ్ లోన్లు ఆఫర్ చేస్తాయి.
UAE బ్యాంకుల నుంచి మార్ట్గేజ్ లోన్ పొందాలంటే మినిమమ్ సాలరీ AED 15,000 అంటే సుమారు రూ.3.3 లక్షలు ఉండాలి. ఇండియన్ సాలరీ ప్రూఫ్ స్వీకరిస్తారు, కానీ UAE వర్క్ వీసా మరియు ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ కూడా కావాలి. 2025లో దుబాయ్ ఫస్ట్-టైమ్ హోమ్ఔనర్షిప్ ఇనిషియేటివ్ ద్వారా ఆఫర్లు కూడా ఉన్నాయి. దుబాయ్‌లో 2025లో 29,000 మంది భారతీయులు 35,000 ఇళ్లు కొన్నారు. ఎంక్వయిరీలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎగువ మధ్యతరగతి వర్గాలు దుబాయ్ లో ఇళ్లు ఉండటాన్ని ఓ స్టేటస్ గా ఫీలయ్యే అవకాశం ఉంది.