హైదరాబాద్ లో ఇంటి ప్లాన్ పొందే పద్దతిని చాలా సులభతరం చేశారు. బిల్డ్ నౌ యాప్ ద్వారా ఇంటి నిర్మాణ అనుమతి పొందవచ్చు. ఈ యాప్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA), డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (DTCP) పరిధిలోని భవన అనుమతులకు ఉపయోగపడుతుంది.
ఎలా అనుమతి పొందాలంటే ?
అధికారిక వెబ్సైట్ http://buildnow.telangana.gov.in లేదా బిల్డ్ నౌ మొబైల్ యాప్‌లో ముందుగా రిజిస్టర్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత, “Apply for Building Permission” లేదా “New Application” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. భవన రకం (రెసిడెన్షియల్/నాన్-రెసిడెన్షియల్), ప్లాట్ సైజు, ఎత్తు (మీటర్లలో), ఇతర వివరాలను నమోదు చేయాలి. ప్లాట్ సైజు 75 చదరపు గజాలు లేదా 62.7 చదరపు మీటర్లు లోపు , గ్రౌండ్ లేదా గ్రౌండ్ + 1 అంతస్తు నిర్మాణం అయితే, అనుమతి అవసరం లేదు. రూ. 1 టోకెన్ ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకుంటేసరిపోతుంది.
దరఖాస్తు రకాన్ని బట్టి అవసరమైన డాక్యుమెంట్లు యాప్ సూచిస్తుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ , ఆమోదిత లేఅవుట్ ప్లాన్ కాపీ, భవన ప్లాన్ కాపీ, ఆర్కిటెక్ట్ సర్టిఫికెట్, వంటివి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వతా దరఖాస్తు రకం , భవన సైజు ఆధారంగా ఫీజు నిర్ణయిస్తారు. ఫీజు ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు. ఫీజు చెల్లింపు కోసం ఫీ ఇంటిమేషన్ లెటర్ అందిన తర్వాత 15 రోజుల్లో చెల్లించాలి, లేకపోతే 10% వడ్డీతో మరో 15 రోజుల్లో చెల్లించాలి.
డాక్యుమెంట్లు మరియు ఫీజు సమర్పించిన తర్వాత, బిల్డ్ నౌ యాప్‌లోని ఏఐ-ఆధారిత సిస్టమ్ దరఖాస్తును స్క్రూటినీ చేస్తుంది. ఇది నాన్-మల్టీస్టోరీ భవనాలకు 1 నిమిషం కంటే తక్కువ సమయంలో, మల్టీస్టోరీ భవనాలకు 2-5 నిమిషాల్లో పూర్తి చేస్తుది. దరఖాస్తు 21 రోజుల్లో ప్రాసెస్ కాకపోతే, అది డీమ్డ్ అప్రూవల్ గా భావించవచ్చు. అయితే సమాచారం ఇస్తే సీరియస్ గా చర్యలు తీసుకుంటారు.
దరఖాస్తు ఆమోదించిన తర్వాత, బిల్డ్ నౌ పోర్టల్‌లో దరఖాస్తు నంబర్‌ను ఉపయోగించి ఆమోదిత భవన అనుమతి డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్‌ను ఉపయోగించి నిర్మాణం ప్రారంభించవచ్చు.