బాలుకి క‌రోనా ఎలా… ఎప్పుడు సోకింది?

క‌రోనా సోకి బాలు ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం, ఆ త‌ర‌వాత క్ర‌మంగా ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డం – క‌రోనా నుంచి కోలుకున్నా, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల‌, బాలు ప‌రిస్థితి చేయి జారిపోవ‌డం ఇవ‌న్నీ తెలిసిన విష‌యాలే. బాలు లాంటి వ్య‌క్తులు ఆరోగ్య‌ప‌రంగా చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. క‌రోనా విజృంభిస్తున్న వేళ‌.. బాలు అన్నిర‌కాల జాగ్రత్త‌లూ తీసుకున్నారు. క‌చేరీలు పూర్తిగా త‌గ్గించేశారు. బ‌య‌ట‌కు వెళ్లినా – అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తోనే వెళ్లేవారు. అయినా స‌రే, ఆయ‌న‌కు క‌రోనా సోకింది. దాంతో బాలుకి అస‌లు క‌రోనా ఎలా సోకింది? దానికి కార‌ణం ఏమిటి? అనే విష‌యాలు ఆరా తీస్తున్నారంతా.

ఓ టీవీ ఛాన‌ల్ కోసం బాలు సంగీత ధారావాహిక నిర్వ‌హిస్తున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతుంది. బాలు ప్ర‌తీసారి చెన్నై నుంచి హైద‌రాబాద్ కి రావ‌డం ప‌రిపాటి. అయితే క‌రోనా వ‌ల్ల ఆయ‌న రావ‌డానికి చాలా భ‌య‌ప‌డ్డారు. కానీ టీవీ ఛాన‌ల్ వాళ్లు ప‌దే ప‌దే ఫోన్ చేసి `పోగ్రాంకి రావాల్సిందే` అని ఒత్తిడి చేయ‌డంతో, ఆయ‌న కాద‌న‌లేక‌.. హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్టు, ఇక్క‌డ మూడ్రోజుల పాటు ఉండి, ఎపిసోడ్స్ పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. బాలుతో ప‌నిచేసిన ట్రూప్ లో కొంత‌మందికి క‌రోనా ఉంద‌ని, వాళ్ల ద్వారా బాలుకి క‌రోనా సోకి ఉండొచ్చ‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ నుంచి చెన్నై వెళ్లాక బాలు కి క‌రోనా సోకింద‌ని నిర్దార‌ణ అయ్యింద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. అలా… బాలు క‌రోనా బారీన ప‌డాల్సివ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోయ‌పాటి.. ఇంత లేటేంటి?

ఓవైపు క‌రోనా, మ‌రో వైపు వ‌ర్షాలు. షూటింగుల‌కు ఆటంకంగా మారాయి. స్టార్ హీరోలు సినిమా షూటింగుల‌కు సిద్ధంగా లేరు. చిరంజీవి, వెంక‌టేష్‌, సినిమాల షూటింగులు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. అన్నీ సిద్ధంగా ఉన్నా... హీరోలు...

పూజా హెగ్డే క‌ల తీరింది

బాలీవుడ్‌లో పాగా వేయాల‌ని ఎవ‌రికి ఉండ‌దు? ముఖ్యంగా సౌత్ ఇండియాలో రాజ్యం ఏలుతున్న క‌థానాయిక‌ల‌కు ఆ ఆశ‌లు ఇంకాస్త ఎక్కువ‌. ఆ అవ‌కాశాలు కొంత‌మందికి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోతుంటాయి. పూజా హెగ్డేకీ...

బీజేపీ నుంచి లంకా దినకర్ సస్పెన్షన్..!

భారతీయ జనతాపార్టీ నేత లంకా దినకర్‌ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆయనకు అధికార ప్రతినిధి పదవి ఇవ్వలేదు. అయితే వివిధ టీవీ చానళ్లలో ఆయన బీజేపీ...

ఏపీ టీడీపీకి పని చేసే అధ్యక్షుడు అచ్చెన్న ..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కింజరాపు అచ్చెన్నాయుడును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. సాధారణంగా ప్రభుత్వంలో హోంమంత్రి పదవిని... పార్టీలో అధ్యక్ష తరహా పదవుల్ని డమ్మీలకు...

HOT NEWS

[X] Close
[X] Close