రూ.10 కోట్ల‌కు అర్జున్ రెడ్డి డిజిట‌ల్ రైట్స్‌?

బాక్సాఫీసు ద‌గ్గ‌ర అర్జున్ రెడ్డి సృష్టిస్తున్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా దాదాపు రూ.40 కోట్ల మార్క్‌కి చేరుకొంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఆ ఫిగ‌ర్ దాటినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఇంత‌టి సూప‌ర్ స‌క్సెస్ అయిన సినిమా మ‌రి శాటిలైట్ రూపంలో ఎంత ద‌క్కించుకొంటుందో?? అనే ఊహాగానాలు ఎక్కువ‌య్యాయి. నిజానికి ఈ సినిమా విడుద‌ల‌కు ముందు శాటిలైట్ కోసం ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ఇది `ఏ`స‌ర్టిఫికెట్ సినిమా. టీవీ కోసం మ‌రోసారి సెన్సార్ చేయాల్సివ‌స్తుంది. రీసెన్సార్‌కి వెళ్తే.. కీల‌క‌మైన సీన్స్ అన్నింటికీ క‌త్తెర ప‌డే అవ‌కాశాలుంటాయి. అందుకే శాటిలైట్ కోసం ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ఇప్పుడు మాత్రం శాటిలైట్ మార్కెట్‌లో ఈ సినిమాకి మంచి రేటు ప‌లికే అవ‌క‌శాలున్నాయ‌ని తెలుస్తోంది.చిత్ర‌బృందం కేవ‌లం శాటిలైట్ హ‌క్కులే కాకుండా, డిజిట‌ల్ రైట్స్‌తో క‌లిపి అమ్మేద్దామ‌నుకొంటోంది. జెమినీ వాళ్ల‌కు రూ.10 కోట్ల‌కు బేరం పెట్టింద‌ట చిత్ర‌బృందం. యూ ట్యూబ‌ల్‌లో ఎక్క‌డ ఏ బిట్‌, పాట ప్లే అయినా.. దానికి సంబంధించిన ఆదాయం జెమినీకే వెళ్తుంద‌న్న‌మాట‌. జెమినీవాళ్లేమో రూ.7 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చి ఆగిన‌ట్టు తెలుస్తోంది. క‌నీసం రూ.8 నుంచి రూ.9 కోట్ల‌లోపు బేరం తెగే అవ‌కాశాలున్నాయి. రూ.4 కోట్ల‌తో తెర‌కెక్కించిన సినిమా ఇది. డిజిట‌ల్ రైట్స్ రూపంలోనే ఇంత మొత్తం వ‌స్తున్నాయంటే… అర్జున్ రెడ్డికి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ జాబితాలో చేర్చేయ‌డంలో త‌ప్పేం లేదు క‌దా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close