విధులకు దూరంగా 20వేల మంది వాలంటీర్లు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థకు.. ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. మొత్తంగా.. గ్రామ, వార్డు స్థాయిలో.. ప్రతి యాభై ఇళ్లకు ఒక్క వాలంటీర్ చొప్పున నియామకాలు చేపట్టాలనుకున్నారు. ఈ మేరకు… రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది వాలంటీర్ పోస్టులు మంజూరు చేశారు. శరవేగంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. ఎంపిక మొత్తం… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరిగింది. ఆ పార్టీకి చెందిన విధేయులను మాత్రమే ఎంపిక చేశారు. అయితే.. వారిలోనూ.. 20వేల మంది వరకూ.. విధుల్లో చేరేందుకు.. నిరాకరిస్తున్నారు. తొలి రోజు.. నియామక పత్రాలు తీసుకోవడానికే.. ఇరవై వేల మంది వరకూ.. గైర్హాజరయ్యారని.. అధికారవర్గాలు చెబుతున్నాయి.

వలంటీర్ పోస్టుల విషయంలో… ప్రభుత్వం.. రోజు రోజుకూ.. కొత్త కొత్త నిబంధనలు పెడుతూ పోయింది. చదువుకుంటున్న వాళ్లు, ఇతర ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారాలు చేసే వాళ్లు వద్దని.. ఫుల్ టైం… వలంటీర్‌గానే.. ఉండాలని నిబంధన విధించింది. ఇక్కడే అసలు చిక్కులు వస్తున్నాయి. వలంటీర్ పోస్టు అంటే… పెన్షన్,రేషన్ డోర్ డెలివరీ చేయడం… ఇతర పథకాలకు సంబంధించి… యాభై ఇళ్ల అవసరాలు చూడటమే కాబట్టి… నెలలో నాలుగైదు రోజులు మాత్రమే పని ఉంటుందని అనుకున్నారు. ఇతర ఉపాధి పొందుతూ… దీన్నో అదనపు ఆదాయంగా మార్చుకుందామనుకున్నారు. కానీ.. ప్రభుత్వం.. ఇలా వేరే ఉద్యోగాలు, ఉపాధి పొందే వాళ్లు, చదువుకునే వాళ్లు అయితే తమ లక్ష్యం నెరవేరదనుకున్నదేమో కానీ… ఆంక్షలు పెట్టింది. దీంతో విధుల్లో చేరడానికి చాలా మంది నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.

సాధారణం.. ఎంత పెద్ద కంపెనీ.. అత్యంత భారీ స్థాయిలో రిక్రూట్ మెంట్ జరిపినా… వంద శాతం అభ్యర్థులు.. ఎప్పుడూ.. జాయిన్ అవరు. చివరికి సివిల్స్ కి ఎంపికైన వారూ.. వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. గ్రామవాలంటీర్ పోస్టు … రూ. ఐదు వేలు గౌరవ వేతనం వచ్చే పోస్టు మాత్రమే. దీని కోసమే… సమయం మొత్తం వెచ్చించాలంటే.. ఎంత వైసీపీ కార్యకర్త అయినప్పటికీ.. సాధ్యమయ్యే పని కాదు. అందుకే.. ఒక వేళ కొత్త ఉత్సాహంతో విధుల్లో చేరినప్పటికీ.. తర్వతా డ్రాపయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే అంచనాలున్నాయి. వారందర్నీ.. మళ్లీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close