తెలంగాణలో రెండు చోట్ల “మృగరాజు ” సినిమా !

అప్పుడెప్పుడో వచ్చిన మృగరాజు అనే సినిమా సీన్లు ఇప్పుడు.. తెలంగాణలో రిపీటవుతున్నాయి. కాకపోతే ఆ సినిమాలో సింహం కోసం వేట సాగిస్తే.. తెలంగాణ రెండు పులుల కోసం వేట సాగుతోంది. అన్న టైగర్ అని అభిమాన రాజకీయ నేతల గురించి చెప్పుకుంటాం కానీ.. నిజంగా పులులు కనిపిస్తే కంటి మీద కునుకు ఉండదు. ఇప్పుడు తెలంగాణ రెండు పులులు హడలెత్తిస్తున్నాయి. కొమురం భీం, సిరిసిల్ల జిల్లాల్లో రెండు పులులు… చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నాయి. దీంతో వీటిని పట్టుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి వేటగాళ్లను పిలిపించాల్సి వచ్చింది. వారంతా బృందాలుగా విడిపోయి అడవుల బాట పట్టారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఓ పులి వ్యవసాయబావిలో పడింది. దాన్ని గుర్తించిన కొంత మంది అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. బావిలో పడిన పులి కదా.. ఎక్కడికీ పోదులే అని వారు తీరిగ్గా వెళ్లారు.

కానీ అది అప్పటికే ఎలాగో బయటకు వచ్చి వెళ్లిపోయింది. దాంతో.. అప్పటి వరకూ నింపాదిగా ఉన్న వారు హడలెత్తిపోయారు. జగిత్యాల ఫారెస్ట్ నుంచి పులి వచ్చినట్లుగా గుర్తించి.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిజానికి ఈ ఘటన జరగక ముందే.. కొమురంభీం జిల్లాలో అటవీశాఖ అధికారులను పెద్ద పులి ఒకటి ముప్ప తిప్పలు పెడుతోంది. బెజ్జూరు అడవుల్లో అటవీశాఖ ఆపరేషన్ కు చిక్కినట్టే చిక్కీ తప్పించుకుంటోంది. ఆ పులి ఇద్దరు మనుషుల్ని కూడా చంపేసింది. దీంతో దాన్ని మ్యాన్ ఈటర్‌గా పేర్కొంటున్నారు. పులి తిరిగిన చోట్ల 10 బోన్లు ఏర్పాటు చేశారు. ఎరగా లేగ దూడలను ఉంచారు.

100కు పైగా సీసీ కెమెరాలను కూడా పెట్టారు. అయితే ఎర వేసిన పశువులను చంపి తినేసి వెళ్లిపోతున్న పులి.. బోను వైపు రావడం లేదు. దీంతో వచ్చినప్పుడు మత్తు మందు ఇచ్చేందుకు హైదరాబాద్‌ షూటర్లను రప్పించారు. 100 మందికిపైగా అటవీ అధికారులు ,సిబ్బంది, టైగర్ ట్రాకర్స్ ఈ ఆపరేషన్‌లో భాగస్వాములయ్యారు. కానీ ఫలితం ఉండటం లేదు. పులిని పట్టుకునే వెనక్కి వెళ్లాలని అధికారులు అక్కడే మకాం వేస్తున్నారు. ఆ పులులు ఎప్పటికి దొరుకుతాయో కానీ.. మృగరాజు సినిమాలో సీన్లన్నీ కళ్లముందు కదులుతున్నాయని.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు చర్చించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close