మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు చిత్రయూనిట్ సన్నద్ధమవుతుంది.
ముందు అనుకున్నట్లుగా సాగరతీరంలో ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేశారు. అయితే ఇప్పుడు అనుమతుల విషయంలో చిత్ర యూనిట్ ఎదురుదెబ్బ తగిలింది. బీచ్ రోడ్డు లో అనుమతి లేదని విశాఖ సిపి సిహెచ్ శ్రీకాంత్ చెప్పారు. దీంతో ఇంజినీరింగ్ ఆడిటోరియం లో ప్రి రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఈ ఈవెంట్ జరగనుంది. వీరసింహారెడ్డి ఈవెంట్ కూడా ఇలానే అనుమతుల నిరాకరణ జరిగింది. మొదట అనుకున్న ప్రదేశం నుండి మరో చోటుకి వేదికని మార్చాల్సివచ్చింది.