విశాఖకు మస్క్ , కుక్ – పబ్లిసిటీ పీక్స్.. మరి రియాలిటీ ?

విశాఖలో గ్రాండ్ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించబోతున్నామని దీనికి టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌లు రాబోతున్నారని వైసీపీ నేతలే కాదు.. మీడియా, సోషల్ మీడియా కూడా ఉదరగొడుతోంది. నిజానికి ఆహ్వానం పంపామని చెబుతున్నారు ఎలా పంపారు.. జస్ట్ ఓ మెయిల్ సెండ్ కొట్టేసి అదే ఆహ్వానం అనుకుంటున్నారా లేకపోతే.. ఆ స్థాయిలో వ్యక్తుల్ని రప్పించాలంటే…ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ ప్రచారం మాత్రం ప్రారంభించేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ప్రపంచంలోని అతి పెద్ద పెట్టుబడిదారులంతా వస్తారని ప్రచారం చేసేస్తున్నారు.

ఇటీవలే ఈ సమ్మిట్‌లో పాల్గొనాలనే వారి కోసం.. ఓ వెబ్ సైట్ ఓపెన్ చేశారు. ఎవరైనా వచ్చి ఒప్పందాలు చేసుకోవాలంటే అందులో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక ప్రభుత్వం పంపే ఆహ్వానాలు వేరే ఉంటాయి. పదిహేను మంది కేంద్రమంత్రుల్ని… యాభై మంది దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తల్ని.. ప్రపంచం వ్యాప్తంగా ప్రముఖ ఇన్వెస్టర్స్ ను పిలుపుస్తున్నామని చెబుతున్నారు. నిజానికి ఎంత మందిని పిలుస్తారో .. ఎంత మంది వస్తారో కానీ.. ప్రారంభించడం మాత్రం ఎలాన్ మస్క్ , టిక్ కుక్ నుంచి ప్రారంభించారు.

వచ్చే వాళ్లలో అదానీ ఉండొచ్చు.. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో పోర్టులు, సంప్రదాయేతర ఇంధన వనరుల్లో ఆయన వాటానే చాలా ఎక్కువ. ఆయన వచ్చి ఇప్పటికే ప్రకటించిన పెట్టుబడులను మళ్లీ ప్రకటించవచ్చు. అరబిందో కూడా రావొచ్చు. వీరు కూడా దావోస్ ప్రకటించిన లెక్కల్నే ప్రకటించవచ్చు. కొత్త వాళ్లు ఎంత మంది వస్తారో తెలియదు. ఎందుకంటే.. పారిశ్రామిక రంగంలో ఏపీ ఇమేజ్ దారుణంగా పడిపోయింది. గతంలో తీసుకున్న కొన్ని చర్యల వల్ల ఏపీ నవ్వుల పాలయింది. సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఫ్రాంక్లీన్ టెంపుల్టన్ వంటి కంపెనీని పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అపహాస్యం చేశాడు. దానికి వాళ్లు కౌంటర్ కూడా ఇచ్చారు. ఇలాంటిపాలకులు ఉన్న చోట ఇన్వెస్టర్లు వస్తారని అనుకోలేం.

కానీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లకు ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో పబ్లిసిటీనే హైలెట్ అవుతోంది. చివరికి ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close