ప్రేమించిపెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రుల్ని కూడా వదిలేయ్.. జీవితాంతం తోడుంటానన్నాడు. చివరికి చంపేసి .. ముక్కలు చేసి.. వరదలతో పారుతున్న మూసిలో పడేశాడు. శరీర భాగాలు కూడా దొరకుండా చేశాడు.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసి మూసి నదిలో పడేశాడు మహేందర్ రెడ్డి అనే వ్యక్తి. వికారాబాద్ కు చెందిన మహేందర్ రెడ్డి తన ఇంటి పక్కన ఉండే స్వాతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో గుళ్లో పెళ్లి చేసుకున్నారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్. హైదరాబాద్ కు వచ్చి కాపురం పెట్టాడు. ఇప్పుడు భార్య గర్భవతి. అయినా చంపేశాడు.
కొన్నాళ్ల కిందట స్వాతి వికారాబాద్ వచ్చింది. స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన మహేందర్ బోడుప్పల్ లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి పై మహేందర్ కు అనుమానం పెరిగిపోయింది. స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి మరింతగా అనుమానంతో రాక్షసుడిగా మారిపోయిన మహేందర్.. ఇంట్లో ఓనర్స్ లేకపోవడంతో హత్యకు ప్లాన్ చేశాడు. స్వాతిని చంపేసి శరీర భాగాలని ముక్కలుగా చేశాడు.
గర్భవతి అయిన స్వాతి మృతదేహాన్ని రంపంతో కోశాడు. కాళ్లు చేతులు తల భాగాలను విడివిడిగా చేశాడు. పొట్ట భాగాన్ని మాత్రం కట్ చేయకుండా ఉంచిన మహేందర్… కాళ్లు చేతులు తలతో ఇతర భాగాలన్నింటినీ ఒక్కోక్కటిగా తీసుకెళ్లి మూసిలో పడేశాడు. తర్వాత పోలీసుల వద్ద లొంగిపోయాడు. మహేందర్ చెప్పిన విషయాలను కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు మూసిలో పడవేసిన మృతదేహాల భాగాలను గాలించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫలితం కనిపించలేదు.