గ్రీన్ బిల్డింగ్స్.. అంటే హరిత నిర్మాణాలు ఇప్పుడు ట్రెండ్. అమరావతిలో కొత్తగా ప్రారంభమైన సీఆర్డీఏ భవనం కూడా గ్రీన్ బిల్డింగే. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) సర్టిఫై చేసింది. మెట్రో నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఐజీబీసీ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. వాతావరణ మార్పులు, వనరుల నిర్వహణ, నగరీకరణ సవాళ్ల మధ్య, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎకో-ఫ్రెండ్లీ పద్ధతులను అవలంబిస్తోంది.
సోలార్ ప్యానెల్స్, LED లైటింగ్, నేచురల్ వెంటిలేషన్, రెయిన్వాటర్ హార్వెస్టింగ్, గ్రేవాటర్ రీసైక్లింగ్ వంటి ఫీచర్లు నూతన భవనాల్లో సాధారణమవుతున్నాయి. స్మార్ట్ బిల్డింగ్స్‌లో AI-డ్రైవన్ IoT డివైసెస్, ఆటోమేటెడ్ లైటింగ్, టెంపరేచర్ కంట్రోల్, బయోమెట్రిక్ సెక్యూరిటీ వంటివి ఎనర్జీ వినియోగాన్ని తగ్గిస్తున్నాయి. గ్రీన్ రూఫ్స్, వర్టికల్ గార్డెన్స్, రీసైకిల్డ్ కాంక్రీట్, బాంబూ, లో-కార్బన్ బ్రిక్స్ వంటి మెటీరియల్స్ కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గిస్తున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) అంచనాల ప్రకారం, గ్రీన్ బిల్డింగ్స్ ఎనర్జీ వినియోగాన్ని 30-50% తగ్గిస్తాయి.
ప్రభుత్వాలు కూడా గ్రీన్ బిల్డింగ్‌లను ప్రోత్సహిస్తున్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ 20-30% ఎనర్జీ సేవింగ్స్, 30-50% వాటర్ సేవింగ్స్ అందిస్తాయి. ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. కోకపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఏరియాల్లో కొత్తగా నిర్మిస్తున్నవన్నీ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల ప్రకారం నిర్మిస్తున్నవే. ఇవి. పర్యావరణం, ఆర్థికం, సమాజానికి లాభదాయకంగా భావిస్తున్నారు.