ఇటీవల మెట్రో చార్జీల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. నష్టాలను పూడ్చుకునేందుకు తమ జేబులకు చిల్లు పెడుతారా అని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చార్జీలను తగ్గించాలని డిమాండ్ లు పెద్దఎత్తున రావడంతో మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ దిగివచ్చింది. చార్జీలను తగ్గిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది.పెంచిన ధరలపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
పెంచిన ధరల ప్రకారం మెట్రోలో కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కు పెరిగాయి. తాజాగా పది శాతం డిస్కౌంట్తో కనిష్ట ఛార్జీ రూ.11, గరిష్ట ఛార్జీ రూ.69కి తగ్గింది. తగ్గిన ధరలు మే 24 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త చార్జీలు
0-2 కిలోమీటర్ల వరకు రూ.11.00
2-4 కిలోమీటర్ల వరకు రూ.17.00
4-6 కిలోమీటర్ల వరకు రూ.28.00
6-9 కిలోమీటర్ల వరకు రూ.37.00
9-12 కిలోమీటర్ల వరకు రూ.47.00
12-15 కిలోమీటర్ల వరకు రూ.51.00
15-18 కిలోమీటర్ల వరకు రూ.56.00
18-21 కిలోమీటర్ల వరకు రూ.61.00
21-24 కిలోమీటర్ల వరకు రూ.65.00
24 కిలోమీటర్ల ఆపైన రూ.69.00
పేపర్, క్యూఆర్ టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులన్నింటిపైన ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని మెట్రో యాజమాన్యం తెలిపింది.