హైదరబాద్‌లో ఇప్పుడు కోకాపేట వంటి ప్రాంతాల్లో అపార్టుమెంట్లు కనీసం రెండు నుంచి మూడు కోట్లు పెట్టాల్సి ఉంటుంది. ఇదే ధరకు దుబాయ్ లోనూ ఇళ్లు లభిస్తాయి. దుబాయ్ అంటే లగ్జరీకి కేంద్రం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఉపాధి అవకాశాల కేంద్రంగా మారుతోంది. ఎక్కువ మంది జనం వచ్చేలా అక్కడి అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతోంది. దేశంలోని ఓ మాదిరి ధనంతులు కూడా దుబాయ్ లో ఆస్తుల కొనుగోలుపై ఆలోచనలు చేస్తున్నారు. అందుకే ఇక్కడ ప్రాపర్టీ షోలు కూడా దుబాయ్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి.
దుబాయ్‌లో మామూలు అపార్ట్మెంట్ కోటి రూపాయలకు లభిస్తుంది. కాకపోతే సైజ్ కాస్త తక్కువ ఉంటుంది. దుబాయ్ సిలికాన్ ఓయాసిస్, ఇంటర్నేషనల్ సిటీ, జుమైరా విలేజ్ సర్కిల్ వంటి ప్రాంతాల్లో రేటు ఎక్కువగా ఉంటుంది. అక్కడ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ రెండు కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. JVC, అల్ ఫుర్జాన్, దుబాయ్ స్పోర్ట్స్ సిటీ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మూడు కోట్ల రూపాయల నుంచి ప్రారంభమవుతాయి.
ఇక దుబాయ్‌లో అఫోర్డబుల్ ప్రాంతాలుగా దుబాయ్ సిలికాన్ ఓయాసిస్, JVC, ఇంటర్నేషనల్ సిటీ. వంటి వాటిని చెబుతారు. ఇలాంటి చోట్ల చిన్న అపార్టుమెంట్ 70 లక్షలకు కూడా వస్తుంది. డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా, బిజినెస్ బే వంటి ప్రాంతాల్లో కాస్త ఎక్కువ ధరలు చెబుతారు. శివారు ప్రాంతాలు అయిన దుబాయ్ సౌత్, దుబైలాండ్ వంటి చోట్ల సింగిల్ బెడ్ రూం ఇళ్లు 50 లక్షలకు కడా వస్తాయి.
దుబాయ్ లో అదనపు ఫీజులు. తక్కువ ఉంటాయి. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఫీజు ప్రాపర్టీ విలువలో నాలుగు శాతం ఉంటుంది. బ్రోకర్ ఫీజు రెండు శాతం ఉంటుంది. భారతీయ పౌరులు దుబాయ్‌లో ఫ్రీహోల్డ్ ప్రాంతాలు అంటే డౌన్‌టౌన్, మెరీనా, JLT మొదలైనవ చోట్ల రెండు కోట్లు పెట్టి ప్రాపర్టీ కొనుగోలు చేస్తే 2-సంవత్సరాల రెసిడెన్సీ వీసా కూడా ఇస్తారు. ఐదు కోట్లు పెట్టి ఇల్లు కొంటే 10-సంవత్సరాల గోల్డెన్ వీసా పొందవచ్చు.