హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో స్లంప్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. బిల్డర్లు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టుల్లో అమ్మకం కాని ఫ్లాట్లు పెరిగిపోతున్నాయి. ఫలితంగా వారి పెట్టుబడి అక్కడ స్ట్రక్ అయిపోతోంది. కొత్త ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఇటీవల అనరాక్ రిపోర్టులో ఈ అంశం పెద్ద సమస్యగా మారిందని వెల్లడయింది.
అనరాక్ రిపోర్టు ప్రకారం దేశంలోని టాప్ 7 మెట్రో సిటీలలో అఫర్డబుల్ హౌసింగ్ అంటే రూ.40 లక్షలు లోపు ఉన్న అన్‌సోల్డ్ స్టాక్ గత ఏడాది Q1 2024 నుండి Q1 2025 వరకు 19 శాతం తగ్గింది. 1.40 లక్షల యూనిట్ల నుండి 1.13 లక్షల యూనిట్లకు తగ్గాయి. కానీ హైదరాబాద్ మాత్రమే ఈ ట్రెండ్‌కు వ్యతిరేకంగా, అఫర్డబుల్ స్టాక్ 9 శాతం పెరిగింది. అంటే అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లు కూడా అమ్ముడు కావడం లేదు. అమ్మకం కాని ప్లాట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
ఈ సమస్య హైదరాబాద్‌కే ఎక్కువగా ఉంది. బెంగళూరులోఅమ్మకం కాని ప్లాట్ల సంఖ్య సగానికి సగం తగ్గింది.. చెన్నైలోనూ అప్ ఉంది. అంటే.. ఆయా నగరాల్లో రియల్ ఎస్టేట్ మెరుగుపడుతుందని అనుకోవచ్చు. గతంలో హాట్ కేక్‌ల్లా అమ్ముడుపోయే హైదరాబాద్ ప్రాపర్టీలు ఇప్పుడు డిమాండ్ తగ్గుముఖం పట్టాయని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తమ్ముడు కాని ఇళ్ల సంఖ్య ఎంత పెరిగితే.. రియల్ ఎస్టేట్ రంగంపై అంత భారం పడుతుంది. ఆ పెట్టుబడి పెట్టిన వారు.. తీవ్రంగా నష్టపోతారు. ఈ సమస్యకు కారణం ఏమిటో.. రియల్ ఎస్టేట్ వర్గాలే విశ్లేషించుకుని పరిష్కార మార్గాలు చూసుకోవాల్సి ఉంది.