ఎదురుదెబ్బలు తగులుతున్నప్పుడు దూకుడు తగ్గించడం తప్పేం కాదు. నిజానికి అదే కరెక్ట్. పరాజయాలు చుట్టుముడుతున్నప్పుడు మనకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. అది.. మనల్ని ఇంకా ప్రమాదంలో పడేస్తుంఉటంది. ఈ విషయం సునీల్ కి అర్థంకావడం లేదు. కమెడియన్ నుంచి హీరో అయి, అక్కడ నిలదొక్కుకోలేక తన స్టామినా చూపించుకోలేక నానా తిప్పలు పడుతున్నాడు సునీల్. ఎంత కష్టపడినా.. ఫలితం దక్కడం లేదు. హీరో అయి తప్పు చేశానా.. అనే ఫీలింగ్ సునీల్కే కలిగేంత ఘోర మైన పరిస్థితి ఉంది. వరుస పరాజయాలతో బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు సునీల్. ఆ హ్యాంగోవర్లోనే.. తప్పులు మీద తప్పులు చేస్తున్నాడు. సునీల్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా… ఈడు గోల్డెహె. ఈ సినిమాని దసరా బరిలోకి దించాలని సునీల్ భావిస్తున్నాడట.
దసరా తిరుగులేని సీజన్. కాకపోతే.. ఆ టైమ్లో వరుసగా సినిమాలు వస్తున్నాయి. హైపర్. ఇజం సినిమాలు ఇప్పటికే దసరా బరిలో దిగుతున్నట్టు డిక్లేర్ చేసేశాయి. అయితే గియితే.. చరణ్ ధృవ కూడా దసరాకే రావొచ్చు. వీటి మధ్య సునీల్ కూడా ఢీకొట్టాలని చూడడం.. నిజంగా సాహసమే. సునీల్ క్రౌడ్ పుల్లింగ్ హీరో కాదు. తన సినిమా బాగుంటేనే జనాలు చూస్తారు. మౌత్ టాక్ని బట్టి వసూళ్లు వస్తాయి. అలాంటప్పుడు.. సోలో రిలీజ్ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. దసరా దాటేస్తే.. సినిమాలేం ఉండవు. అప్పుడు.. బాక్సాఫీసు దగ్గర కూడా పోటీ ఉండదు. కాస్త బాగున్నా.. సినిమా నిలబడిపోతుంది. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకే రావాలి.. అంటున్నాడట. నిజంగానే గుడ్డిగా దసరా కోసం సిద్దపడితే.. సునీల్ ఏరి కోరి రిస్కులో పడినట్టే. అందుకే వీరూపోట్ల, సునీల్ సన్నిహితులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నార్ట. సునీల్ తగ్గుతాడో లేదో??