మ‌హేష్‌లో ఓ ద‌ర్శ‌కుడు ఉన్నాడా?

మ‌హేష్ సినిమా గురించో, మ‌హేష్ గురించో మాట్లాడేట‌ప్పుడు అంద‌రి టాపిక్కూ ఒక్క‌టే. అంతా మ‌హేష్ అందం గురించి మాట్లాడాల్సిందే. ఇంచుమించు మ‌హేష్ బాబు ప్ర‌తీ వేడుక‌లోనూ ఇదే క‌నిపిస్తుంది, వినిపిస్తుంది. క‌థానాయిక‌ల‌తైతే మ‌హేష్ గ్లామ‌ర్ గురించీ, మ‌హేష్ సెన్సాఫ్ హ్యూమ‌ర్ గురించీ గంట‌ల కొద్దీ మాట్లాడేస్తుంటారు. అయితే పూజా హెగ్డే మాత్రం మ‌హేష్‌లోని కొత్త యాంగిల్‌ని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది. మ‌హేష్ 25వ చిత్రం మ‌హ‌ర్షిలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌యాణంలో మ‌హేష్‌లో ఓ ద‌ర్శ‌కుడ్ని చూశానంటోంది పూజా.

మ‌హేష్ ఎప్ప‌టికైనా ఓ ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని, ఎందుకంటే త‌ను స‌న్నివేశాన్ని అర్థం చేసుకునే విధానం కొత్త‌గా ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది పూజా. దీనికి మ‌హేష్ కూడా స్పందించాడు. ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకుంటే మంచిద‌ని అక్క‌డిక‌క్క‌డే స‌ర్దేశాడు. “నీ కాంప్లిమెంట్‌కి థ్యాంక్స్‌. అయితే ఇక్కడ ఎవ‌రి ప‌నులు వాళ్లు చేయాలి. న‌టుడు చేయాల్సిన ప‌ని న‌టుడే చేయాలి.. ద‌ర్శ‌కుడు చేయాల్సిన ప‌ని ద‌ర్శ‌కుడు చేయాలి” అంటూ పూజా కాంప్లిమెంట్‌ని లైట్ తీసుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కరోనా మరణమృదంగం..! ఆపడానికి ప్రయత్నాల్లేవా..?

ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు రెండు వేలు దాటిపోయాయి. గత రెండు రోజులుగా.. రోజుకు కొద్దిగా తక్కువగా వంద మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ అనేది ప్రాణాంతకం కాదని... చికిత్స చేస్తే పోతుందని ప్రభుత్వం...

“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ...

టీటీడీపై కరోనా పడగ..! బ్రహ్మోత్సవాలు ఎలా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఓ అర్చకుడు కూడా ఉన్నారు. అర్చకుల్లో సగం మందికిపైగా వైరస్ బారిన...

తప్పు యాజమన్యాలది .. పరిహారం మాత్రం ప్రజల సొమ్మా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా హై ప్రోఫైల్ ప్రమాదం జరిగితే ముందుగా... భారీగా నష్ట పరిహారం ప్రకటించడానికి ఉత్సాహపడుతోంది. ముందూ వెనుక ఆలోచించకుండా.. ఎంత మంది చనిపోయారో తెలియకుండానే.. ఆ ప్రమాద వార్త హైలెట్...

HOT NEWS

[X] Close
[X] Close