సుకుమార్‌పై మ‌హేష్ సెటైర్ వేసేశాడుగా…!

మ‌హేష్ బాబు – సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రావాల్సింది. అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. అదే క‌థ అల్లు అర్జున్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింది. ఈ ఎపిసోడ్‌ని మ‌హేష్ అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోరు. ఇప్పుడు ఆ టాపిక్ మ‌హేష్ కూడా మ‌ర్చిపోలేద‌ని అర్థ‌మైపోయింది. `మ‌హ‌ర్షి` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ఇన్ డైరెక్ట‌ర్‌గా, ఆ మాట‌కొస్తే డైరెక్ట్‌గానే మ‌హేష్ సుకుమార్‌పై సెటైర్ వేసేశాడు. వంశీ పైడిప‌ల్లిని పొగుడుతూ.. పనిలో ప‌నిగా సుకుమార్ చేసిన త‌ప్పుని వేలెత్తి చూపించాడు.

“నా ద‌గ్గ‌ర‌కు వంశీ క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు 20 నిమిషాలు క‌థ విని.. పంపించేద్దాం అనుకున్నా. కానీ క‌థ బాగా న‌చ్చింది. కానీ నా క‌మిట్‌మెంట్స్ నాకున్నాయి. మ‌రో రెండు సినిమాల వ‌ర‌కూ చేయ‌డం కుద‌ర‌దు. అదే విష‌యం చెప్పా. మీ కోసం ఎంత‌కాల‌మైనా ఎదురుచూస్తా అన్నాడు. ఈ రోజుల్లో అలా ఎదురుచూడ‌డం చాలా క‌ష్టం. రెండు నెల‌లు కూడా ఓ హీరో కోసం ఎదురుచూడ‌లేక‌పోతున్నారు. ఆ క‌థ ప‌ట్టుకుని మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతున్నారు” అంటూ సుకుమార్ ఎపిసోడ్‌ని గుర్తు చేశాడు మ‌హేష్‌.

మొత్తానికి అంతా మ‌ర్చిపోయిన ఎపిసోడ్ మ‌హేష్ కామెంట్ల వ‌ల్ల మ‌రోసారి పురుడు పోసుకుంది. మ‌రో వారం- ప‌ది రోజుల వ‌ర‌కూ టాలీవుడ్ అంతా మ‌హేష్ కామెంట్లే వినిపించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“జై అమరావతి” అంటే బీజేపీలో సస్పెన్షనే..!

అమరావతి రైతుల కోసం పోరాడతామని భారతీయ జనతా పార్టీ ఓ వైపు చెబుతోంది. ఆ రైతులకు మద్దతు చెప్పేందుకు వెళ్లిన నేతలపై మాత్రం సస్పెన్షన్ల వేటు వేస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా ఓ...

మోడీకి జగన్ అభినందనలు..!

నిజమే.. మీరు కరెక్ట్‌గానే చదివారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ అభినందనలు తెలిపారు. మోడీ ఆ అభినందులు రిసీవ్ చేసుకుని .. జగన్ అభినందించినందుకు పొంగిపోయారో లేదో తెలియదు కానీ.. మోడీని జగన్ అభినందించిన...

క్రైమ్ : ఒకరిది ఆత్మహత్య…మరొకరిది హత్య..! ఇద్దరు తండ్రుల కథ..!

వారిద్దరూ ఆడపిల్లల తల్లిదండ్రులు. కని పెంచి.. అల్లారుముద్దుగా పెంచి.. తమకు చేతనయినంతలో మంచోళ్లు అనుకునే వాళ్లకే కట్టబెట్టారు. కానీ వారు అనుకున్నంత మంచోళ్లు కాదు. ఆ విషయం తెలిసి తమ కూతుళ్లు జీవితాలు...

ఐవైఆర్ కూడా అమరావతినే ఉంచమంటున్నారు..!

వారం రోజులు ఆలస్యంగా తన పెన్షన్ వచ్చిందని... మూడు రోజులుగా ఐవైఆర్ కృష్ణారావు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆయన రోజువారీగా... ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి జగన్‌కు సలహాలిస్తూ ట్వీట్లు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close