ఐబొమ్మ, కప్పం టీవీలను పోలీసులు క్లోజ్ చేయించారు. ఐ బొమ్మ జోలికి రావొద్దని గతంలో హెచ్చరించిన రవితోనే వీటిని క్లోజ్ చేయించారు. విడాకుల కోసం హైదరాబాద్ వచ్చి పోలీసులకు చిక్కిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు ఆ వెబ్ సైట్లను క్లోజ్ చేయించారు. ఆయన బెయిల్ పై బయటకు వచ్చినా మళ్లీ యాక్టివేట్ చేసుకునే అవకాశం లేకుండా పూర్తిగా డిలీట్ చేయించినట్లుగా తెలుస్తోంది.
ఐబొమ్మ, బప్పం టీవీల పేరుతో ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లు ఎంతోకష్టపడి తీసిన సినిమాలను రాత్రికి రాత్రి పైరసీ చేసి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసేవాడు. ఆయన దెబ్బకు ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయేది. గతంలో పోలీసులు చర్యలు తీసుకోవాలనుకుంటే హెచ్చరికలు జారీ చేశారు.కానీ పోలీసుల్ని తక్కువ అంచనా వేశాడు. ఇండియాకు వచ్చి దొరికిపోయాడు.
ఐ బొమ్మ, బప్పం టీవీలను క్లోజ్ చేయించడం వల్ల.. ఇండస్ట్రీకి చాలా మేలు జరగనుంది. మరికొన్ని పైరసీ వెబ్ సైట్స్ కూడా ఉన్నాయి. వాటి సంగతి తేల్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇమ్మడి రవిని జైలుకు పంపనున్నారు.

